ఉద్యోగం పేరిట మోసం...నిరుద్యోగ యువతిని హోటల్ గదికి పిలిచి...మత్తు మందు ఇచ్చి...

ముగ్గురు కలిసి గదిలోనే భోజనం చేశారు. భోజనం తర్వాత ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశారు. మీనా కూడా కాదనలేక ఐస్ క్రీమ్ కప్పు అందుకుంది. రెండు స్పూన్లు నోట్లో పెట్టుకుందో లేదో...ఆమె మత్తులోకి జారుకుంది.

news18-telugu
Updated: March 27, 2020, 8:00 AM IST
ఉద్యోగం పేరిట మోసం...నిరుద్యోగ యువతిని హోటల్ గదికి పిలిచి...మత్తు మందు ఇచ్చి...
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
నిరుద్యోగ యువతులనే లక్ష్యంగా చేసుకొని వారిని వ్యభిచారంలోకి దింపుతున్న ఓ ముఠా గుట్టు రట్టుఅయ్యింది. ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో బాధితురాలు మీనా (పేరు మార్పు) స్థానికంగా నర్సింగ్ కోర్సు పూర్తి చేసుకుంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న ఓ ఉద్యోగాల ఏజెన్సీ విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రకటనలు ఇచ్చింది. ఈ ప్రకటనకు ఆకర్షితురాలైన మీనా, ఆ ఏజెన్సీని సంప్రదించింది. అక్కడే మోసం జరిగింది. ఏజెన్సీ నిర్వాహకుడు బబ్లూ విదేశాల్లో ఉద్యోగాల కోసం చాలా ఖర్చు అవుతుందని తెలిపాడు. దీంతో మీనా తాను అంత స్థితిమంతురాలిని కాదని, తన వద్ద డబ్బు లేదని, ఎలాగైనా విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తే, తాను వేతనం అందుకున్న తర్వాత చెల్లిస్తానని తెలిపింది. అయితే బబ్లూ మాత్రం కంగారు ఏమి లేదని తనతో టచ్ లో ఉంటే ఏం చేయాలో చెబుతానని చెప్పాడు. అయితే బబ్లూ తరచూ మీనాకు ఫోన్ చేయడం ప్రారంభించాడు. తాను డబ్బు సర్దుబాటు చేస్తానని నమ్మబలికేవాడు. మీనాకు తనపై నమ్మకం కలిగేలా బబ్లూ జాగ్రత్తపడ్డాడు. ఈ క్రమంలో ఒక రోజు బబ్లూ ఫోన్ అందుకొని మీనాకు కాల్ చేశాడు. డబ్బు సర్దుబాటు అయ్యిందని, ఒక ప్రముఖ వ్యాపార వేత్త డబ్బు స్పాన్సర్ చేసేందుకు ముందుకు వచ్చాడని తెలిపాడు. దీంతో మీనా ఆనందం రెట్టింపు అయ్యింది. అయితే నగరంలోని ఓ ప్రముఖ హోటల్ లో ఆ వ్యాపారిని కలిస్తే డబ్బు ఇచ్చేస్తాడని, కొని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంటే చాలని చెప్పాడు. దీంతో మీనా ఆలస్యం చేయకుండా ఆటో ఎక్కి హోటల్ చేరుకుంది. బబ్లూ చెప్పినట్లే హోటల్ కు వెళ్లి, రూం నెంబర్ 201 తలుపు తట్టింది. ఓ మధ్య వయస్సు వ్యక్తి డోర్ తెరిచాడు. మీనా హెలో అని తనను తాను పరిచయం చేసుకొని లోపలికి ప్రవేశించింది. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. ఇంతలో బబ్లూ కూడా రూమ్ కు చేరుకున్నారు. ముగ్గురు కలిసి లంచ్ చేద్దామని బబ్లూ అన్నాడు. మీనా వద్దు అంటూనే భోజనానికి సరే చెప్పింది. ముగ్గురు కలిసి గదిలోనే భోజనం చేశారు. భోజనం తర్వాత ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశారు. మీనా కూడా కాదనలేక ఐస్ క్రీమ్ కప్పు అందుకుంది.

రెండు స్పూన్లు నోట్లో పెట్టుకుందో లేదో...ఆమె మత్తులోకి జారుకుంది. ఇంకేముంది....బబ్లూ, అతడితో పాటు ఉన్న వ్యక్తి ఇద్దరూ కలిసి మీనాపై లైంగిక దాడి చేశారు. తమ పశువాంఛ తీర్చుకున్నారు. మెలుకువ వచ్చిన తర్వాత అసలు విషయం తెలుసుకున్న మీనా భోరుమన్నది. అందుకు బబ్లూ విదేశాల్లో ఉద్యోగం కావాలంటే ఇలాంటి పనులు చేయాల్సి ఉంటుందని, అప్పుడే డబ్బు సర్దుబాటు అవుతుందంటూ ఎగతాళిగా మాట్లాడాడు. అంతేకాదు తన వద్ద చాలా మంది క్లయింట్స్ ఉన్నారని వారి శారీరక సుఖాలు తీర్చితే మరింత డబ్బు సర్దుబాటు అవుతుందని అప్పుడు ఎంచక్కా విదేశాల్లో సెటిలై పోవచ్చు అంటూ మీనాకు ఆశ కల్పించాడు. దీంతో ఏం చేయాలో అర్థం కాని మీనా తాను మోసపోయానని గ్రహించి అక్కడి నుంచి ఎలాగో బయట పడింది. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించగా, బబ్లూ ఆఫీసుపై ఆకస్మిక దాడులు నిర్వహించి, పారిపోతుండగా అతడిని అరెస్టు చేశారు. మరో నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణలో ఉంది.

First published: March 27, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు