నడిరోడ్డుపై యువతి ఛాతీపై చేయి వేసి నీచంగా ప్రవర్తించిన కీచకుడు.. కానీ ఇలా జరుగుతుందని ఊహించి ఉండడు..

(ప్రతీకాత్మక చిత్రం - image credit - youtube)

యువతి తాను పనిచేసే ప్రదేశానికి వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న సమయంలో.. ఓ కారు అడ్డుగా వచ్చింది. అదే సమయంలో సైకిల్‌పై వచ్చిన వ్యక్తి యువతి ఛాతిపై చేయి వేశాడు.

 • Share this:
  రోడ్డుపై తనతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి తగిన గుణపాఠం చెప్పంది ఓ యువతి. అతనిపై సివంగిల విరుచుకుపడింది. ఈ ఘటన నోయిడాలో సహరా రెడ్ లైట్ ప్రాంతానికి సమీపంలో చోటుచేసుకుంది. వివరాలు.. బాధిత యువతి నోయిడా సెక్టార్ 12లోని ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తుంది. అయితే ఆ యువతి తాను పనిచేసే ప్రదేశానికి వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న సమయంలో.. ఓ కారు అడ్డుగా వచ్చింది. యువతి దానిని తప్పించుకుని సేఫ్ ప్లేస్‌కు చేరింది. అయితే ఇంతలోనే అక్కడికి సైకిల్‌పై వచ్చిన ఓ 40 ఏళ్ల వ్యక్తి ఆమె ఛాతిపై చేతులు వేసి.. అక్కడ నుంచి వెళ్లిపోయాడు. దీంతో క్షణకాలం పాటు ఆ యువతి షాక్ అయింది. అయితే వెంటనే జరిగిన విషయం గ్రహించి సివంగిలా రెచ్చిపోయింది. సైకిల్‌పై వెళ్తున్న అతడి వెంట పరుగెత్తి చేజ్ చేసింది. అతని చొక్కా పట్టుకుని చెంపదెబ్బలు కొట్టింది.

  ఈ ఘటన సంబంధించి బాధిత యువతి మాట్లాడుతూ.." నేను ఇక్కడ ఆరేళ్ల నుంచి ఉంటాను. కానీ ఎప్పుడూ సేఫ్‌గా లేనని అనిపించలేదు. కానీ ఈ ఘటనతో నేను షాక్ అయ్యాను. కొందరు తాము ఏమైనా చేసి బయటపడొచ్చు అని అనుకుంటారు. అతడు తర్వాత సారీ చెప్పినప్పటికీ అతడు చేసిన పని నీచమైనది. నేను అతడిని పట్టుకుని నిలదీస్తుంటే కనీసం నాకు సాయం చేసేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు" అని తెలిపింది. అయితే ఆ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు లేకపోవడం వల్ల ఇలా జరిగిందని ఆమె అభిప్రాయపడింది. ఇలాంటి జరగడానికి ఆ ప్రాంతంపై నిఘా పెట్టేలా సీసీటీవీ కెమెరాలు లేకపోవడం కూడా ఒక కారణమని ఆమె తెలిపింది.

  ఇక, ఆ వ్యక్తిని యువతి కొడుతున్న దృశ్యాలను కొందరు వీడియో తీయడంతో అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు నోయిడా అడిషనల్‌ డీసీపీ రణవిజయ్ సింగ్ ఈ ఘటనపై ఫిర్యాదు దాఖలు చేయాల్సిందిగా బాధిత మహిళను కోరారు. ఈ మేరకు నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్లు వెల్లడించారు.
  Published by:Sumanth Kanukula
  First published: