Married Woman: భర్త కోసం 1,000 కి.మీ ప్రయాణించిన భార్య.. ఊహించని షాక్ ఇచ్చిన మామ..

ప్రతీకాత్మక చిత్రం (Image-Youtube)

ఓ యువతి తన భర్త కోసం 1,000 కి.మీ ప్రయాణించింది. తీరా భర్త ఇంటికి చేరుకున్న ఆమెకు భర్త తండ్రి ఊహించని షాక్ ఇచ్చాడు.

  • Share this:
    ఓ యువతి తన భర్త కోసం 1,000 కి.మీ ప్రయాణించింది. తీరా భర్త ఇంటికి చేరుకున్న ఆమెకు భర్త తండ్రి ఊహించని షాక్ ఇచ్చాడు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) చోటుచేసుకుంది. వివరాలు.. బేతుల్‌కు (Betul) చెందిన రాకేష్‌కు కొంతకాలం క్రితం పెళ్లి వేడుకలో ఓ యువతి పరిచయం అయింది. అప్పుడు వారిద్దరు ఒకరికొకరు ఫోన్ నెబంర్స్ ఎక్చేంజ్ చేసుకున్నారు. ఆ తర్వాత రాకేస్ ప్రతి రోజు యువతితో ఫోన్‌లో మాట్లాడేవాడు. ఈ క్రమంలోనే వారి మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఒకరితో ఒకరు కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. దీంతో ఇద్దరు వారి వారి ఇళ్ల నుంచి ఎవరికి చెప్పకుండా పారిపోయారు. అనంతరం సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు.

    ఆ తర్వాత పితాంబర్ ప్రాంతంలో గది అద్దెకు తీసుకున్నారు. మూడు నెలల పాటు ఆ ఇంట్లోనే ఉన్నారు. ఈ విషయం తెలుసకున్న రాకేష్ తల్లిదండ్రులు.. అతడిని 2018 జూన్‌లో ఇంటికి పిలించారు. రాకేష్, యువతికి బేతుల్‌లోని ఆర్య సమాజ్‌లో పెళ్లి జరిపించారు. నెల రోజుల పాటు వారు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత ఇంట్లో నుంచి వెళ్లి పోవాలని చెప్పడంతో.. ఇద్దరు కలిసి గది అద్దెకు తీసుకుని ఉన్నారు. అయితే ఆ తర్వాత ఆర్థికంగా పరిస్థితులు దిగజారడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. ఈ క్రమంలోనే రాకేష్ ఉద్యోగం చేస్తానని చెప్పి విదేశాలకు వెళ్లాడు. భార్యను ఆమె తల్లిదండ్రుల ఇంట్లో ఉండమని చెప్పాడు. దీంతో ఆమె పుట్టింటికి చేరింది.

    Husband and Wife: అతడు బిజినెస్‌మెన్.. ఆనందంగా సాగిపోతున్న జీవితం.. కానీ ఇలా ఊహించని విధంగా...

    అయితే కొద్ది రోజుల క్రితం యువతి తండ్రి ఢిల్లీకి (Delhi) షిఫ్ట్ కావడంతో.. ఆమె కూడా అక్కడికి వెళ్లిపోయింది. అయితే అప్పటి నుంచి యువతితో ఆమె భర్త మాట్లాడటం మానేశాడు. అయితే ఇటీవల రాకేష్ విదేశాల నుంచి తిరిగివచ్చాడని తెలుసుకున్న ఆమె భర్త కోసం ఢిల్లీ నుంచి బేతుల్‌కు బయలుదేరింది. దాదాపు 1,000 కి.మీ ప్రయాణించి అత్తారింటికి చేరింది. అయితే అత్తారింట్లో వారు మాత్రం రాకేష్ ఇంట్లో లేడని చెబుతూ వచ్చారు. మరోవైపు రాకేష్ తండ్రి రూ. 50 వేలు తీసుకుని తన కొడుకుని వదిలిపెట్టాలని యువతిని కోరాడు. అంతేకాకుండా తనను ఇంట్లో నుంచి గెంటివేశారని ఆ యువతి ఆరోపించింది.

    Hyderabad: ఒకే మహిళతో ఇద్దరు వ్యక్తులకు వివాహేతర సంబంధం.. బయటపడ్డ అసలు విషయం.. చివరకు ఇలా..

    భర్తతో కలిసి ఉండకుండా రూ. 50 వేలు తీసుకుని ఏం చేయాలని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు పోలీసులను ఆశ్రయించినట్టుగా తెలిపింది. రాకేష్ తన జీవితాన్ని నాశనం చేశాడని, 7 నెలలుగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నానని చెప్పింది. పోలీసులు కూడా ఈ విషయంలో ఏమి చేయలేమని అన్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
    Published by:Sumanth Kanukula
    First published: