Woman burns daughter : తమిళనాడులో దారుణం జరిగింది. మూడో భర్త ముందు పాతివ్రత్యం నిరూపించుకునేందుకు కన్నబిడ్డకే నిప్పంటించింది ఓ మహిళ. 75శాతం కాలిన గాయాలతో సోమవారం సాయంత్రం ఆ చిన్నారి మరణించింది. తమిళనాడు రాజధాని చెన్నై శివార్లలోని తిరువొట్టియూర్ లో ఈ ఘటన జరిగింది. కన్నబిడ్డకు నిప్పటించిన తల్లిని,ఆమె భర్తని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు రాజధాని చెన్నై శివార్లలోని తిరువొట్టియూర్ లో ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జయలక్ష్మీ(38) అనే మహిళలకు ఆమె 19 ఏళ్ల వయస్సులో పల్వన్ణన్ అనే వ్యక్తితో పెళ్లి అయింది. వీరిద్దరికీ ఓ ఆడపిల్ల జన్మించింది. ఆ తర్వాత కొన్నిరోజులకు కూతురిని ట్యుటికోరిన్ లోని తన పుట్టింటిలో వదిలేసి..పల్వనన్ ను వదిలేసి అతని తమ్ముడు దురైరాజ్ ను పెళ్లాడి ముంబైకి వెళ్లిపోయింది. ముంబైలో ఉన్న సమయంలో పవిత్ర అనే చిన్నారికి జయలక్ష్మీ జన్మనిచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకు రెండో భర్తను కూడా వదిలేసి పవిత్రను తీసుకుని చెన్నైకు వచ్చేసింది జయలక్ష్మి. ఆమె తిరువొత్తియూర్లో స్థిరపడింది. అక్కడ ఆమెకు విడాకులు తీసుకున్న మరియు ట్యాంకర్ డ్రైవర్ అయిన పద్మనాభన్ తో స్నేహం ఏర్పడింది. వీరిద్దరూ తొమ్మిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ సంతానంగా ఆరేళ్లు, నాలుగేళ్ల వయస్సున్న పిల్లలు ఉన్నారు ప్రస్తుతం.
ALSO READ రోడ్డుపై భిక్షాటన.. నెలకు రూ.40వేలు సంపాదిస్తున్న మహిళ.. ఏ రోజు ఎంత? డైరీలో పక్కాగా లెక్కలు
అయితే జయలక్ష్మి పాతివ్రత్యాన్ని అనుమానిస్తూ పద్మనాభన్ తరచూ మద్యం తాగి వచ్చి ఆమెతో గొడవ పడేవాడు. ఆదివారం రాత్రి వీరిద్దరి మధ్య గొడవ పెద్దది అయింది. వాదన మధ్యలో పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాలంటే కూతురు పవిత్రకు నిప్పు పెట్టాలని.. నిజంగా నువ్వు అమాయకురాలే అయితే పాపకు ఏ హానీ జరగదంటూ జయలక్ష్మిని రెచ్చగొట్టాడు పద్మనాభన్. దీంతో వెంటనే పవిత్ర నిద్రపోతున్న గదిలోకి వెళ్లి లాక్కొచ్చిన జయలక్ష్మి కిరోసిన్ ఒంటిపై పోసి నిప్పు పెట్టింది. బాలిక అరుపులకు స్థానికులు వచ్చి చూసేసరికి మంటల్లో చిన్నారి కేకలు పెడుతూ కనిపించింది. వెంటనే దగ్గరలోని హాస్పిటల్ కు తరలించారు. అయితే 75శాతం కాలిన గాయాలతో సోమవారం సాయంత్రం బాలిక మృతి చెందింది. ఘటనపై కేసు నమోదుచేసి జయలక్ష్మిని, ఆమె మూడో భర్త పద్మనాభన్ ను పోలీసులు అరెస్టు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Fire Accident, Tamilnadu, WOMAN