WOMAN BRUTALLY MURDERED HER SISTER SON IN GUNTUR SU
గుంటూరులో దారుణం.. బాలుడిని అత్యంత పాశవికంగా హత్య చేసిన పిన్ని
ప్రతీకాత్మక చిత్రం
సొంత అక్క కొడుకును అత్యంత దారుణంగా హత్య చేసింది ఓ మహిళ. అల్లరి చేస్తున్నాడనే కారణంతో తొలుత గొంతుకోసి అతనిని హత్య చేసింది. ఆ తర్వాత పొట్ట కోసి పేగులు, గుండె బయటకు తీసి పైశాచికంగా ప్రవర్తించింది.
సొంత అక్క కొడుకును అత్యంత దారుణంగా హత్య చేసింది ఓ మహిళ. అల్లరి చేస్తున్నాడనే కారణంతో తొలుత గొంతుకోసి అతనిని హత్య చేసింది. ఆ తర్వాత పొట్ట కోసి పేగులు, గుండె బయటకు తీసి పైశాచికంగా ప్రవర్తించింది. ఆ మహిళ సైకో ప్రవర్తన చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ పాశవిక ఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. చినతురకపాలేనికి చెందిన పాతిమా, ఆసియా అక్కాచెల్లెళ్లు. ఫాతిమాకు పెదతురకపాలేనికి చెందిన షేక్ ఫరీద్తో వివాహమైంది. ఇక, ఆసియాకు ముద్దినగర్కు చెందిన షేక్ సలాంతో వివాహం జరిగింది. ఫాతిమాకి ఫయాజ్ కరిముల్లా, కరిముల్లా ఖాజా, కరీమూన్ ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆసియాకు అబిద్, షమ్రీ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఫాతిమా కుటుంబం నరసరావుపేటలో నివాసం ఉంటుండగా.. రెండు రోజుల క్రితం ఆమె తన పిల్లలతో కలిసి లింగంగుట్ల గ్రామంలోని చెల్లెలి ఇంటికి వచ్చింది. ఆదివారం ఫాతిమా, ఆమె తల్లి ఖాదర్బీ, సలాం పనిమీద చీరాల వెళ్లారు. దీంతో పిల్లలు, ఆసియా ఇంటి వద్దే ఉన్నారు.
మధ్యాహ్నం సమయంలో అల్లరి చేస్తున్నాడనే కారణంతో ఆసియా తన అక్క కొడుకు ఫయాజ్ కరిముల్లాను కొట్టడం మొదలుపెట్టింది. ఇది చూసిన చుట్టుపక్కల వారు వారించారు. అయితే ఆసియా తీవ్రంగా మండిపడటంతో.. వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆసియా.. కత్తితో ఫయాజ్ గొంతుకోసి, అక్కడి నుంచి పొట్ట వరకు చీల్చింది. అనంతరం పేగులు, గుండె తీసి రక్తం తాగింది. దీంతో కరీమూన్తో పాటు, మిగతా ముగ్గురు పిల్లలు భయపడిపోయారు. సమయస్ఫూర్తితో వ్యహరించిన కరీమూన్ మిగతా ముగ్గరు పిల్లతో కలిసి ఇంటిలోపలి గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది.
ఈలోపు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. గదిలో ఉన్న పిల్లల్ని రక్షించారు. ఆసియాను అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. ఆమె పోలీసులపైనా తిరగబడటంతో తాళ్లతో కట్టేసి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.బాలుడి మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇక, అక్కడికి చేరుకున్న బాలుడి తల్లి ఫాతిమా, ఇతర కుటుంబసభ్యలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.