బాయ్‌ఫ్రెండ్‌తో హోటల్ రూమ్‌లో.. బర్త్ డే పార్టీలో ఊహించని దారుణం..

వీరిద్దరు ఏడాది క్రితం సోషల్ మీడియాలో ఒకరికొకరు పరిచయమయ్యారని పోలీసులు చెప్పారు. సదరు మహిళకు ఇంతకుముందే వివాహమై భర్తతో దూరంగా ఉంటున్నట్టు చెప్పారు.

news18-telugu
Updated: November 13, 2019, 1:04 PM IST
బాయ్‌ఫ్రెండ్‌తో హోటల్ రూమ్‌లో.. బర్త్ డే పార్టీలో ఊహించని దారుణం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఢిల్లీలోని అలీపూర్‌లో ఉన్న ఓయో హోటల్లో సోమవారం రాత్రి ఓ మహిళ (33) హత్యకు గురైంది. 21 ఏళ్ల తన బాయ్‌ఫ్రెండ్ విక్కీ మన్ చేతిలోనే ఆమె హత్యకు గురైంది. విక్కీ మన్ పుట్టినరోజు సందర్భంగా ఓయో హోటల్ రూమ్ బుక్ చేసిన ఆమె.. బర్త్ డేకి ఏర్పాట్లు చేసింది. విక్కీ మన్‌తో కలిసి సోమవారం రాత్రి హోటల్ గదికి వెళ్లింది. బర్త్ డే పార్టీ సందర్భంగా ఇద్దరు కలిసి మద్యం సేవించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆమె విక్కీ మన్‌ను అకారణంగా చెంపదెబ్బ కొట్టింది. బాయ్‌ఫ్రెండ్ విక్కీ మన్ దాన్ని సరదాగానే తీసుకుంటాడని భావించింది. కానీ విక్కీ దానికి తీవ్రంగా రియాక్ట్ అయ్యాడు.దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. కోపోద్రిక్తుడైన విక్కీ కత్తితో ఆమెను పొడిచి హత్య చేశాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు.

మంగళవారం ఉదయం 10.30గంటలకు హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. రక్తపు మడుగులో పడివున్న ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్దారించారని పోలీసులు తెలిపారు. హోటల్ రూమ్ బుకింగ్ సందర్భంగా ఇచ్చిన డాక్యుమెంట్స్ ఆధారంగా పోలీసులు ఆమె వివరాలు తెలుసుకున్నారు.
ఆపై కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

కాగా, వీరిద్దరు ఏడాది క్రితం సోషల్ మీడియాలో ఒకరికొకరు పరిచయమయ్యారని పోలీసులు చెప్పారు. సదరు మహిళకు ఇంతకుముందే వివాహమై భర్తతో దూరంగా ఉంటున్నట్టు చెప్పారు. వీరిద్దరు రెగ్యులర్‌గా అలీపూర్ ఓయో హోటల్‌కి వెళ్తున్నారని.. ఇదే క్రమంలో సోమవారం రాత్రి బర్త్ డే పార్టీ జరుపుకోవడానికి వెళ్లారని తెలిపారు. మరుసటిరోజు ఉదయం 10గంటలకు హోటల్ సిబ్బంది వెళ్లి.. రూమ్ తలుపు తట్టగా తీయలేదన్నారు. ఎన్నిసార్లు తలుపు తట్టినా తీయకపోవడంతో పోలీసులక సమాచారం అందించారని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. జరిగిన ఘటనపై ఓయో యాజమాన్యం విచారం వ్యక్తం చేశారు. హోటల్లో భద్రతాపరమైన చర్యలను మరింత కట్టుదిట్టం చేస్తామన్నారు.

First published: November 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...