హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఫేస్‌బుక్ పరిచయం.. యువకుడిని నగ్నచిత్రాలు సోషల్ పెడతానని బెదిరించి..

ఫేస్‌బుక్ పరిచయం.. యువకుడిని నగ్నచిత్రాలు సోషల్ పెడతానని బెదిరించి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ నెల 19న ఉదయం 11 గంటలకు ఆమె వీడియోకాల్ చేసి నగ్నంగా కనిపిస్తూ నువ్వు కూడా అలాగే కన్పించాలంటూ కోరింది. దీంతో ఆ యువకుడు యువతి చెప్పినట్టు చేశాడు.

  ఓ వ్యక్తికి గుర్తుతెలియని మహిళతో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త చనువుగా పెరిగి నగ్నంగా వీడియో కాల్ చేసేంత వరకు వచ్చాడు. తీరా ఆ మహిళ యువకుడి నగ్న చిత్రాలను రికార్డు చేసింది. ఆ చిత్రాలను సోషల్ మీడియాలో పెడతానంటూ యువకుడిని బెదిరింపులకు దిగింది. అతడి నుంచి రూ.10 వేలు లాగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరు సుల్తాన్‌పాళ్యకు చెందిన ఓ వ్యక్తి(32)తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా కొద్దిరోజుల క్రితం ఓ మహిళ(30)తో పరిచయం అయ్యింది. ఈ క్రమంలోనే ఇద్దరు నంబర్లు మార్చుకున్నారు. రోజూ చాటింగ్ చేసుకునేవారు. ఈ నెల 19న ఉదయం 11 గంటలకు ఆమె వీడియోకాల్ చేసి నగ్నంగా కనిపిస్తూ నువ్వు కూడా అలాగే కన్పించాలంటూ కోరింది. దీంతో ఆ యువకుడు యువతి చెప్పినట్టు చేశాడు. అయితే ఆ యువతి నగ్న వీడియో కాల్ దృశ్యాలను రికార్డు చేసింది.

  కొద్దిసేపటి తర్వాత ఆ యువకుడికి ఫోన్ చేసి నీ నగ్న చిత్రాలు నా దగ్గర ఉన్నాయి. డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించింది. దీంతో భయపడిన ఆ వ్యక్తి యువతి చెప్పిన విధంగానే బ్యాంకు ఖాతాలో రూ.10వేలు వేశాడు. మళ్లీ డబ్బులు ఇవ్వాలని పదేపదే బెదిరించడంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

  Published by:Anil
  First published:

  Tags: Blackmail, CYBER CRIME, Social Media

  ఉత్తమ కథలు