మగాళ్లకు చుక్కలు చూపించిన కిలాడీ లేడీ... శృంగార వీడియోలతో బ్లాక్‌మెయిలింగ్

బాధితుడైన ఓ వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదుతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె మొబైల్‌ను పరిశీలించిన పోలీసులకు దిమ్మతిరిగిపోయింది.

news18-telugu
Updated: September 21, 2020, 9:49 PM IST
మగాళ్లకు చుక్కలు చూపించిన కిలాడీ లేడీ... శృంగార వీడియోలతో బ్లాక్‌మెయిలింగ్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మహిళలను వీడియోల ఆధారంగా బ్లాక్‌మెయిల్ చేసిన మోసగాళ్లు చాలామందే ఉన్నారు. అయితే శృంగార వీడియోల పేరుతో అనేక మంది మగాళ్లకు చుక్కలు చూపించింది ఓ కిలాడీ లేడీ. డబ్బు కోసం తన అందాన్ని, వలపును వలగా వేసి అనేక మంది మగాళ్లను బ్లాక్‌మెయిల్ చేసింది ఓ మహిళ. సమాజంలో కాస్త పలుకుబడి.. డబ్బున్న వ్యక్తులను టార్గెట్‌ చేస్తుంది. వారికి ఏదో విధంగా దగ్గరవుతుంది. ఆనక సన్నిహితంగా ఉన్న వీడియోలు, ఫొటోలు నా దగ్గరున్నాయంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతుంది. వాటిని సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తానంటూ బెదిరిస్తుంది. అలా చేయకుండా ఉండాలంటే లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని టీచర్స్‌ కాలనీలో ఉండే ఒక మహిళ ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. బాధితుడైన ఓ వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదుతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదుపులోకి తీసుకున్నారు. ఆమె మొబైల్‌ను పరిశీలించిన పోలీసులకు దిమ్మతిరిగిపోయింది.

ఆమె బాధితుల లిస్టులో చాలామంది ఉన్నారు. వారిలో ఉన్నతోద్యోగులు.. వ్యాపారులు ఉన్నారు. కొందరు సమాజంలో పరువు పోతుందని భయపడి ఆమె డిమాండ్‌ చేసిన మేర ఇచ్చుకుని ఎలాగోలా బయటపడగా.. తాజాగా ఓ వ్యాపారిని ఆమె పదిలక్షలు డిమాండ్‌ చేయడంతో అతను తిరగబడ్డాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత కొంత కాలంగా ఈమె సాగిస్తున్న ఈ వలపు వల కార్యక్రమాన్ని నిరాఠంకంగా కొనసాగించడానికి మరో ఇద్దరు వ్యక్తుల తోడ్పాటు కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పాల్వంచ, ఇల్లెందు పట్టణాలకు చెందిన ఈ ఇద్దరు వ్యక్తులు ఆమె బాధితుణ్ని సంప్రదించి బేరసారాలు సాగిస్తుంటారని.. ఎందుకొచ్చిన గొడవ ఎలాగోలా వదిలించుకుంటే పోలా అంటూ వారి స్థాయిని బట్టి పిండుకుంటుంటారని వెలుగుచూసింది.

అయితే ఈ మొత్తం వ్యవహారాలన్నిటినీ ఈమె పాల్వంచలో ఆమె దగ్గరి బంధువు ఉద్యోగం చేస్తున్న ఓ అంగన్‌వాడీ కేంద్రం అడ్డాగా సాగిస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. గత కొద్ది నెలలుగా కరోనా కారణంగా అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడి ఉండడంతో తన వలపు వలకు చిక్కిన వ్యక్తులను ఆమె ఇక్కడకే రప్పించి రహస్యంగా వీడియోలలో చిత్రీకరించేదని తేలింది. ఇప్పటికే ఆమె బాధితుల జాబితాలో పాల్వంచ కేటీపీఎస్‌లోని ఓ డీఈఈ స్థాయి అధికారి, మరో ఫోర్‌మెన్‌ స్థాయి ఉద్యోగి, ఇంకా భద్రాచలం ప్రాంతానికి చెందిన కొందరు ఉన్నట్టు తేలింది. దీంతో ఆమెపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆమెకు సహకరించిన వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆమె అడ్డాగా ఏర్పాటు చేసుకున్న అంగన్‌వాడీ కేంద్రం వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా ఆమె బాధితుల జాబితాలో ఉన్న వాళ్లంతా ఊపిరిపీల్చుకున్నారు.
Published by: Kishore Akkaladevi
First published: September 21, 2020, 9:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading