కట్టుకున్న భర్త మోసం చేశాడని..తెలిసి అత్తింటి ముందే మహిళ పోరాటం...

కొన్ని రోజుల క్రితం ఇంట్లో నుండి భార్యను వెల్లగొట్టాడు.. తను అమ్మ వారింటికి వెళ్లడంతో తనకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్నాడాన్ని భార్య భాగ్యకు తెలిసింది.

news18-telugu
Updated: July 1, 2020, 4:22 PM IST
కట్టుకున్న భర్త మోసం చేశాడని..తెలిసి అత్తింటి ముందే మహిళ పోరాటం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నిజామాబాద్ జిల్లాలో ఓ మహిళ తనకు తెలియకుండా తన భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని భర్త ఇంటిముందు మహిళ సంఘాలతో కలిసి ధర్నా కు దిగింది.. నిజామాబాద్ జిల్లా మోతె గ్రామానికి చెందిన జడల నగేష్ కు 2006 లో నిజామాబాద్ మండలం కలూరు కు చెందిన జడల భాగ్యతో వివాహం జరిగింది.. సంసారం జీవితం సాఫిగా సాగింది.. అయితే గత రెండు సంవత్సరాలు గా పిల్లలు పుట్టడం లేదని భర్త నగేష్ భార్యను వేధించడం మొదలు పెట్టాడు.. రోజు హింసించేవాడు. కొన్ని రోజుల క్రితం ఇంట్లో నుండి భార్యను వెల్లగొట్టాడు.. తను అమ్మ వారింటికి వెళ్లడంతో తనకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్నాడాన్ని భార్య భాగ్యకు తెలిసింది.

దీంతో తనకు న్యాయం చేయాలని నా భర్త నాకు కావాలని. లేదంటే న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి కదిలేదు అంటూ ఆ మహిళ భర్త ఇంటి ముందు భీష్మించి కూర్చుంది. ఆమెకు తోడుగా మహిళ సంఘాల మహిళలు కలిసి ధర్నా కు కూర్చున్నారు.. అయితే జడల నగేష్ వీరి రాకను ముందే గ్రహించిన ఇంటికి తాళం వెసి కుటుంబ సభ్యులతో కలిసి పరారయ్యారు.
First published: July 1, 2020, 4:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading