తాగొచ్చిన భర్తను చావగొట్టిన భార్య... ఆ తర్వాత...

Delhi : ఏపీ ప్రభుత్వం మద్యపానాన్ని నిషేధిస్తామని ప్రకటించింది. అది సరైన నిర్ణయం కాదనేవాళ్లు చాలా మంది ఉన్నారు. ఐతే... ఇలాంటి ఘటనల్ని చూస్తే... మద్యాన్ని బంద్ చెయ్యాలనే నిర్ణయమే సరి అనడంలో తప్పేమీ లేదు.

news18-telugu
Updated: October 14, 2019, 9:07 AM IST
తాగొచ్చిన భర్తను చావగొట్టిన భార్య... ఆ తర్వాత...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Delhi Crime : అది ఢిల్లీలోని నరేలా ప్రాంతం. చీకటై చాలా సేపైంది. అర్థరాత్రి భర్త ఊగుతూ, తూలుతూ ఇంటికొచ్చాడు. వెల్డింగ్ పనిచేస్తున్న జావేద్ రెహ్మాన్... రోజూ తాగి రావడం... భార్య సల్మాతో గొడవ పెట్టుకోవడం. ఆమెను చిదకబాదడం. ఆమె ఏడ్వడం. ఇది ఆ ఇంట్లో డైలీ కార్తీక దీపం. ఐతే... సల్మా ఢిల్లీ మహిళా కమిషన్ (DCW)లోని మహిళా పంచాయతీ సభ్యురాలు. అప్పుడప్పుడూ ఆ కమిషన్ దగ్గరకు వెళ్తూ ఉంటుంది. అక్కడ అందరూ మాట్లాడుకునే మాటలు వింటూ ఉంటుంది. భార్యల్ని కొట్టే భర్తల్ని ఊరికే వదిలిపెట్టకూడదంటూ వినిపించే మాటలు... ఆమెలో ఎక్కడ లేని ధైర్యాన్ని తెచ్చేవి. పైగా ఆమె మహిళా పంచాయతీ సభ్యురాలు కావడంతో... ఆ పంచాయతీలో మగాళ్లకు వ్యతిరేకంగా చెప్పే విషయాల్ని బాగా మైండ్‌కి ఎక్కించుకునేది. ఆ క్రమంలో తను కూడా తన భర్తను ఎదిరించాలని అనుకుంది.

ఆదివారం భార్యతో గొడవ పడిన రెహ్మాన్... ఆ కోపంలోనే వెల్డింగ్ పనికి వెళ్లిపోయాడు. పని పూర్తయ్యాక ఫుల్లుగా తాగాడు. అర్థరాత్రి ఇంటికి వచ్చి మళ్లీ గొడవ కంటిన్యూ చేశాడు. మంచి నిద్ర చెడగొట్టడమే కాక... తనపైనే దాడి చేస్తుంటే ఏ భార్య మాత్రం సహిస్తుంది? సల్మాకి పిచ్చి కోపం వచ్చింది. అంతలోనే రెహ్మాన్ నిద్రలోకి జారుకున్నాడు. రోజూ ఏంటీ నస నాకు అనుకుంది. ముగ్గురు పిల్లలు నిద్రలేచి... ఆశ్చర్యంగా చూస్తుండగానే... భర్తను చితకబాదింది. ఆవేశంలో ఇష్టమొచ్చినట్లు కొట్టేసింది. ఇన్నాళ్లుగా భరించిన కష్టాల కసి మొత్తం ఆదివారం రాత్రి చూపించింది. అసలే తాగి వున్న రెహ్మాన్‌కి మత్తు దిగేలోపే ప్రాణం పోయింది. బెడ్‌పై పడిన శవాన్ని అలాగే ఉంచి... శని వదిలిపోయిందనుకుంటూ ఆమె పిల్లల్ని నిద్రపుచ్చి... ఆమె కూడా నిద్రలోకి జారుకుంది.

తెల్లారి ఆరైంది. రెహ్మాన్ తమ్ముడు అజిమ్ ఆ ఇంటికొచ్చాడు. తలుపులు తెరిచే ఉండటంతో లోపలికి వెళ్లాడు. అన్న ఇంకా నిద్ర లేవలేదే... రాత్రి తాగింది దిగలేదేమో అనుకున్నాడు. ఏంటలా చూస్తున్నావ్... ఇక మీ అన్న నిద్ర లేవడు. శాశ్వతంగా నిద్రపోతున్నాడు అంది. షాకైన అజిమ్... ఏంటి వదినా అని అడిగాడు. చంపేశాను అంటూ... అసలు విషయం చెప్పి... తల బాదుకుంటూ... కన్నీటి సంద్రమైంది సల్మా.

అజిమ్ కాల్‌తో పోలీసులు రావడం... డెడ్ బాడీని పట్టుకెళ్లడం, పోస్ట్‌మార్టం చెయ్యడం, మహిళా కమిషన్ స్పందించడం అన్నీ జరిగాయి. పోస్ట్‌మార్టంలో ఓ విషయం తెలిసింది. సల్మా... రెహ్మాన్‌ను ముందుగా బెల్టుతో కొట్టింది. ఆ తర్వాత ఇనుప రాడ్డుతో ఒక్కటిచ్చింది. ఈ విషయాలేవీ పోలీసులకు చెప్పలేదు. ఓ నాలుగు దెబ్బలేస్తే చచ్చాడని చెప్పింది. రెహ్మాన్ తల్లి మాత్రం... సల్మా ఇలా చాలాసార్లు తన కొటుకును కొట్టేదనీ, చేతికి ఏది దొరికితే దాంతో చితకబాదేదని పోలీసులకు చెప్పింది. రెండ్రోజుల కిందటే రెహ్మాన్‌ను మెట్లపై నుంచీ కిందకు తోసేసిందని ఆరోపించింది. పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.

ఈ మొత్తం ఎపిసోడ్‌లో అసలు విలన్ మద్యమే. సో... మద్యమే తాగకుండా ఉండి ఉంటే... డబ్బులు వేస్ట్ అవ్వవు. ఆరోగ్యం పాడవ్వదు. ఆ ఫ్యామిలీలో అన్నీ సంతోషాలే ఉండేవి. అవునా కాదా.


Pics : బాలీవుడ్‌ను కట్టిపడేస్తున్న తన్యా గవ్రీ ఫ్యాషన్ డిజైన్స్

ఇవి కూడా చదవండి :


బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా సౌరవ్‌ గంగూలీ... దాదాపు ఖరారు

ఏపీలో 1,448 ఆలయాల్లో పాలక మండళ్ల భర్తీ... నోటిఫికేషన్లు జారీ

ఉత్తమ్‌‌కుమార్‌కి ఉద్వాసన... హుజూర్‌నగర్ ఎన్నిక తర్వాతే ముహూర్తం

ఇంకెంతమంది చనిపోవాలి... సీఎం కేసీఆర్‌పై భగ్గుమంటున్న ఆర్టీసీ కార్మికులు
Published by: Krishna Kumar N
First published: October 14, 2019, 9:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading