పూజకు పిలవలేదని.. గుంపును తీసుకొచ్చి అన్నను కొట్టిచంపిన చెల్లి..

తన సోదరుడు తనను పూజకు పిలవలేదన్న కోపంతో ఓ చెల్లి.. తన అన్నను కొట్టిచంపింది.

news18-telugu
Updated: November 5, 2019, 2:25 PM IST
పూజకు పిలవలేదని.. గుంపును తీసుకొచ్చి అన్నను కొట్టిచంపిన చెల్లి..
నమూనా చిత్రం
  • Share this:
తన సోదరుడు తనను పూజకు పిలవలేదన్న కోపంతో ఓ చెల్లి.. తన అన్నను కొట్టిచంపింది. ఓ గుంపును తీసుకొచ్చి బీభత్సంగా దాడి చేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. బీహార్‌లోని నలందలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఛత్ పూజ అనేది ఉత్తరాదిలో ప్రధానమైంది. జితన్ మాంఝీ అనే వ్యక్తి ఇంట్లో ఛత్ పూజ చేసుకుంటూ.. అతడి సోదరి రేఖాదేవిని పిలవలేదు. దీంతో ఆమెకు కోపం వచ్చింది. అన్న ఇంటికి వెళ్లి గట్టిగా నిలదీసింది. అనంతరం తమ ఇంటికి వెళ్లిపోయి.. ఆరేడుగురిని తీసుకుని వచ్చింది. ఆ గుంపు చేతిలో బ్లేడు, వెదురుబొంగులతో వచ్చారు. వచ్చీరావడంతోనే జితన్ మాంఝీ మీద దాడి చేయడం మొదలుపెట్టారు. జితన్ మాంఝీ మీద జరుగుతున్న దాడిని చూసి పొరుగున ఉన్న వ్యక్తి రంజిత్ పెద్ద ఎత్తున కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చారు. వారు రావడం చూసిన రేఖాదేవి, ఆమెతో వచ్చినవారు పారిపోయారు.

కేన్సర్ పేషెంట్ల కోసం గుండుకొట్టించుకున్న యువతిFirst published: November 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...