మహిళపై 8 మంది గ్యాంగ్ రేప్.. ఐరన్ రాడ్‌తో దాడి..

Gang Rape in Haryana : బాధిత మహిళ 100 నంబర్‌కు ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని.. ఆమెను ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఘటనపై జీఆరో ఎఫ్ఐఆర్ నమోదైంది.

news18-telugu
Updated: August 23, 2019, 9:02 AM IST
మహిళపై 8 మంది గ్యాంగ్ రేప్.. ఐరన్ రాడ్‌తో దాడి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గ్రామమైన కర్నల్‌లో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన ఓ మహిళపై ఎనిమిది మంది గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో చండీఘడ్‌లోని పీజీఐ ఆస్పత్రికి తరలించారు. బాధిత మహిళ 100 నంబర్‌కు ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని.. ఆమెను ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఘటనపై జీఆరో ఎఫ్ఐఆర్ నమోదైంది. కర్నల్ మహిళా పోలీస్ స్టేషన్ పోలీసులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు.

బాధిత మహిళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చిందని.. కర్నల్ రైల్వే స్టేషన్‌లో ఆమె రైలు కోసం వేచియున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఆమెకు ఫుడ్ ఆఫర్ చేశారని పోలీసులు తెలిపారు. ఆపై సమీపంలోని ఓ ఫ్యాక్టరీ షెడ్‌లోకి తీసుకెళ్లాడని..అక్కడ మరో ఏడుగురితో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పారు. బాధిత మహిళ వారిని ప్రతిఘటించగా.. ఐరన్ రాడ్‌తో ఆమెపై దాడికి పాల్పడ్డట్టు చెప్పారు. పరారీలో ఉన్న ఆ ఎనిమిది గురించి గాలిస్తున్నామని.. సీసీటీవి ఫుటేజీలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు.

First published: August 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు