ఓ వ్యక్తి తన స్నేహితుని తల్లిని వేధింపులకు గురిచేశాడు. అంతేకాకుండా ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ చర్యలను ప్రతిఘటించిన ఆమెను హత్య చేశాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బాస్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ వివరాలను శుక్రవారం పోలీసులు వెల్లడించారు. వివరాలు.. నిందితుడు చింతమణి పటేల్ అలియాస్ చింటు, బాధితురాలు కుమారుడు ఇద్దరు స్నేహితులు. వీరిద్దరు ఒకే గ్రామానికి చెందినవారు. సమీపంలోని పొలాల్లో పార్క్ చేసిన తన హార్వెస్టర్‌ను చూడటానికి చింటు అతడి స్నేహితుడుని తీసుకుని వెళ్లాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. అయితే చింటు స్నేహితుడు ఆ సమయంలో ఇంట్లో లేడు. ఇదే విషయాన్ని బాధితురాలు.. చింటుకు తెలిపింది. అయితే అప్పటికే చీకటి పడటం, ఒంటరిగా పొలాల్లోకి వెళ్లాల్సి రావడంతో బాధితురాలి చింటుకు తోడుగా వెళ్లింది. అయితే తిరిగి వచ్చే సమయంలో చింటు.. బాధితురాలిపై వేధింపులకు పాల్పడ్డాడు. ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. అయితే దీనిని బాధితురాలు ప్రతిఘటించింది. దీంతో చింటు ఆవేశంలో ఆమె తలపై రాతితో కొట్టాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు
అయితే బాధితురాలి అరుపులు వినిపించిన గ్రామస్థులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ బాధితురాలు నేలమీద పడి ఉన్నట్టు గుర్తించారు. అక్కడ జరిగిన విషయాన్ని బాధితురాలు కొందరు గ్రామస్తులకు తెలిపింది. ఇక, గ్రామస్తులు బాధితురాలిని సమీపంలో ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మరణించింది.
బాధితురాలు చనిపోయేముందు చెప్పిన స్టేట్మెంట్ ఆధారంగా గురువారం పోలీసులు నిందితుడు చింటును అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని పోలీసులు శుక్రవారం వెల్లడించారు.