బెంగళూరులో దారుణం : వదినను వివస్త్రను చేసి దాడికి పాల్పడ్డ మరిది..

ప్రతీకాత్మక చిత్రం

పరిమళ ఆమెను వ్యభిచారిణి అని తిట్టడంతో వివాదం మరింత ముదిరింది. ఇద్దరు ఘర్షణ పడేదాకా వెళ్లింది. ఈ క్రమంలో పరిమళ భర్త, కుమార్తె కూడా తోడై ఆమెపై దాడికి పాల్పడ్డారు.

 • Share this:
  బెంగళూరులోని కమనహళ్లిలో ఓ మహిళపై బంధువులే దాడికి తెగబడ్డారు. ఆమెను నడిరోడ్డుపై వివస్త్రను చేసి చెప్పులతో కొట్టారు. బాధితురాలు స్థానిక పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తోడి కోడలితో తలెత్తిన వివాదమే దాడికి దారితీసినట్టు పోలీసులు నిర్దారించారు. పోలీసుల కథనం ప్రకారం.. బనస్వాడి ప్రాంతంలో ఓ మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి తన మరిది కుటుంబంతో నివాసం ఉంటోంది. గత జనవరి నెలలో ఆమె భర్త శివ కుమార్ చనిపోయాడు. ఇదే క్రమంలో మంగళవారం ఏదో పని నిమిత్తం ఇంటికి చేరుకున్న ఆమె.. ఇంటి ముందు బైక్ పార్క్ చేస్తుండగా తోడి కోడలు పరిమళతో వివాదం రాజుకుంది.

  పరిమళ ఆమెను వ్యభిచారిణి అని తిట్టడంతో వివాదం మరింత ముదిరింది. ఇద్దరు ఘర్షణ పడేదాకా వెళ్లింది. ఈ క్రమంలో పరిమళ భర్త, కుమార్తె కూడా తోడై ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఆమెను బయటకు ఈడ్చుకెళ్లి చెప్పులు, రాళ్లతో కొట్టారు. ఏ పనిచేయకుండా ఖాళీగా ఉంటున్నందుకు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా బెదిరించారు. అంతేకాదు, ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు.. పరిమళ ఆమెపై కత్తితో దాడికి పాల్పడింది. వదిన వరుసయ్యే మహిళను మరిదే వివస్త్రను చేసి దాడికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఇంటికొచ్చాక.. బైక్ పార్క్ చేస్తుండగా పరిమళ కత్తితో వచ్చి నాపై దాడికి పాల్పడింది. ఆ వెంటనే ఆమె భర్త, కుమార్తె కూడా నాపై దాడికి పాల్పడ్డారు. నన్ను ఈడ్చుకెళ్లి ముఖంపై కత్తితో పొడిచారు. మా మరిది నన్ను వివస్త్రను చేసి తలపై రాయితో మోదాడు.
  బాధితురాలు

  First published: