వివాహిత స్నానం చేస్తున్న వీడియో తీసి బ్లాక్ మెయిల్...బీటెక్ విద్యార్థి నిర్వాకం...

కక్ష పెంచుకున్న ఆ యువకుడు ఆ మహిళ స్నానం చేస్తుండగా రహస్య కెమెరాతో వీడియో తీశాడు. దాన్ని ఆమె‌కు చూపించి రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తన దగ్గర అంత డబ్బులు లేవని వివాహిత ఎంత చెప్పినా వినిపించుకోలేదు.

news18-telugu
Updated: July 1, 2020, 9:56 PM IST
వివాహిత స్నానం చేస్తున్న వీడియో తీసి బ్లాక్ మెయిల్...బీటెక్ విద్యార్థి నిర్వాకం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వివాహిత స్నానం చేస్తున్న వీడియోను లీక్ చేస్తానని ఓ ఇంజనీరింగ్ యువకుడు బ్లాక్ మెయిల్ చేసిన ఘటన కోల్ కతాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే అలీపూర్ కు చెందిన యువకుడు . తన ఇంటికి సమీపంలో ఉండే వివాహితపై కన్నేశాడు. ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు. ప్రతి రోజు ఇబ్బంది పెట్టడంతో ఆమె ఈ విషయాన్ని తన భర్త దృష్టికి తీసుకెళ్లింది. ఆమె భర్త యువకుడిని కాస్త గట్టిగానే మందలించాడు.

కక్ష పెంచుకున్న ఆ యువకుడు ఆ మహిళ స్నానం చేస్తుండగా రహస్య కెమెరాతో వీడియో తీశాడు. దాన్ని ఆమె‌కు చూపించి రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తన దగ్గర అంత డబ్బులు లేవని వివాహిత ఎంత చెప్పినా వినిపించుకోలేదు. డబ్బులు ఇవ్వాలని లేకుంటే నెట్ లో వీడియో పెడతానని బెదిరించడంతో చేసేదిలేక భర్తకు విషయం చెప్పింది. దీంతో ఆయన పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి యువకుడిపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
First published: July 1, 2020, 9:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading