కరోనా క్వారంటైన్ కేంద్రంలో ఘోరం...యువతి స్నానం చేస్తున్న వీడియోలతో బ్లాక్ మెయిల్...

తాత్కాలిక బాత్రూంలో మహిళ స్నానం చేస్తున్న సమయంలో నిందితులు వీడియోను రూపొందించారు. తరువాత, నిందితుడు బాలిక వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడని అలాగే శారీరక వాంఛ తీర్చాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు.

news18-telugu
Updated: May 24, 2020, 7:04 PM IST
కరోనా క్వారంటైన్ కేంద్రంలో ఘోరం...యువతి స్నానం చేస్తున్న వీడియోలతో బ్లాక్ మెయిల్...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలోని కరోనా క్వారంటైన్ కేంద్రంలో 22 ఏళ్ల బాలికకు లైంగిక వేధింపులకు గురిచేసిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సాగర్ జిల్లా ఇన్‌చార్జి గాధకోట పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రాజేష్ బంజారా మాట్లాడుతూ దామోహ్ జిల్లాలో నివసిస్తున్నఓ మహిళ ఫిర్యాదు మేరకు ఇద్దరు 20, 23 ఏళ్ల యువకులను అరెస్టు చేశామని తెలిపారు. నిందితులు ఓ మహిళ నగ్న వీడియోలు తయారు చేశారని, ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామని బెదిరించారని తెలిపారు. వివరాల్లోకి వెళితే ఇండోర్ వచ్చిన మహిళ సాగర్ జిల్లాలోని భటౌలి గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో ఉంటోంది. అయితే ఆ ప్రత్యేక నివాసంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక బాత్రూంలో మహిళ స్నానం చేస్తున్న సమయంలో నిందితులు వీడియోను రూపొందించారు. తరువాత, నిందితుడు బాలిక వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడని అలాగే శారీరక వాంఛ తీర్చాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడని, అయితే ఆ మహిళ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ఇద్దరినీ అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ విషయంపై పోలీసులు వివరంగా దర్యాప్తు చేస్తున్నారు.
First published: May 24, 2020, 7:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading