కృష్ణానదిలో దూకి.. విజయవాడ మహిళ ఆత్మహత్యాయత్నం..

విజయవాడలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రకాశం బ్యారేజీపై నుంచి కృష్ణా నదిలోకి దూకి ప్రాణాలు తీసుకోవాలని చూసింది.

news18-telugu
Updated: February 20, 2020, 12:58 PM IST
కృష్ణానదిలో దూకి.. విజయవాడ మహిళ ఆత్మహత్యాయత్నం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
విజయవాడలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రకాశం బ్యారేజీపై నుంచి కృష్ణా నదిలోకి దూకి ప్రాణాలు తీసుకోవాలని చూసింది. అదృష్టవశాత్తు గజ ఈతగాళ్లు అక్కడే ఉన్నారు. ఆమె ఆత్మహత్యకు పాల్పడటాన్ని గమనించి, అప్రమత్తమై నదిలోకి దూకి కాపాడారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బుధవారం నాడు బ్యారేజీపైకి తన కుమారుడితో కలిసి నడుచుకుంటూ వచ్చిన మహిళ.. కుమారుడిని అక్కడే వదిలేసి, బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకింది. కాగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యాయత్నానికి కారణమై ఉంటుందని భావిస్తున్నారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: February 20, 2020, 10:32 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading