కుమారుడి స్నేహితులతో మహిళ శారీరక సంబంధం.. రోజూ డ్రగ్స్, మత్తు ఇచ్చి..

ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. కుమారుడి స్నేహితులతోనే శారీరక సంబంధం పెట్టుకుంది. పైగా, వారికి రోజూ డ్రగ్స్, మత్తు, ఆల్కాహాల్ ఇచ్చి వారిని బానిసలుగా మార్చుకుంది.

news18-telugu
Updated: October 16, 2019, 8:17 PM IST
కుమారుడి స్నేహితులతో మహిళ శారీరక సంబంధం.. రోజూ డ్రగ్స్, మత్తు ఇచ్చి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. కుమారుడి స్నేహితులతోనే శారీరక సంబంధం పెట్టుకుంది. పైగా, వారికి రోజూ డ్రగ్స్, మత్తు, ఆల్కాహాల్ ఇచ్చి వారిని బానిసలుగా మార్చుకుంది. అదీకాక.. వాళ్లు మైనర్లు కావడం గమనార్హం. ఈ అమానవీయ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. అమేలియా(47) తన కుమారుడి స్నేహితులను నిరంతరం ఇంటికి పిలిచేది. వారితో సన్నిహితంగా మెలుగుతూ ఆల్కాహాల్, డ్రగ్స్ అలవాటు చేసింది. ఇంట్లోనే పార్టీలు నిర్వహించి వారికి కావాల్సిన ఆనందాన్ని ఇచ్చింది. ఆ తర్వాత వారితో శారీరక సంబంధం పెట్టుకుంది. అయితే, ఆమె చర్యలను గమనించిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బట్టబయలైంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టగా నిందితురాలు నిజాన్ని ఒప్పుకుంది.

అంతేకాదు.. తన ఇంట్లో నిర్వహించే పార్టీలకు ఎక్కువగా పిల్లలను, 12 నుంచి 14 ఏళ్ల మధ్య ఉండే వాళ్లను ఆహ్వానించేదని, వారితో ఉండాల్సిన దానికంటే ఎక్కువ సన్నిహితంగా మెలుగుతూ వారిని బుట్టలో పడేసుకునేందుకు యత్నించేదని వెల్లడైంది. ప్రస్తుతం 20వేల డాలర్ల పూచీకత్తుపై విడుదలైనా, ఈ నెల 25న కోర్టు తుది తీర్పు రానుంది. నేరం రుజువైతే.. ఆమె పెద్ద శిక్షే పడే అవకాశం ఉంది.

First published: October 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>