మూగ జీవాలపై కర్కషత్వం చూపిన అమానవీయ ఘటన ఇది.. కనీస విచక్షణ లేకుండా వ్యవహరించిన సందర్భం ఇది.. కామంతో కళ్లు మూసుకుపోయి ఏకంగా ఓ కుక్కపైనే అత్యాచారయత్నానికి పాల్పడ్డారు ముగ్గురు. అందులో ఓ మహిళ కూడా ఉండటం గమనార్హం. థాయిలాండ్‌లో ఆవుపై బలాత్కారం చేసిన ఘటన మరువకముందే అమెరికాలోని టెక్సస్‌లో కుక్కపై అత్యాచారయత్న ఘటన చోటుచేసుకుంది. 2017 డిసెంబరులో ఈ ఘటన జరిగినా, తాజాగా.. ఈ కేసులో తీర్పు వెలువడింది. వివరాల్లోకెళితే.. జెర్రీడ్ కుక్, కెవిన్ కుక్ అనే వ్యక్తులు రైడర్ అనే కుక్కను పెంచుకుంటున్నారు. అయితే, కుక్క 1వ పుట్టిన రోజు సందర్భంగా దానికి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు. నీచంగా ఆలోచించి.. ఓ యువతితో సెక్స్ చేయించాలనుకున్నారు.
అదే సమయంలో కుక్కతో సెక్స్ చేయాలనుకుంటున్నానని రెబెక్కా లిటిల్ అనే యువతి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేసింది. అది చూసిన వీరిద్దరు కుక్కను ఆమె అపార్టుమెంటుకు తీసుకెళ్లారు. అయితే, ఆ శునకం భయపడి.. అరిచింది.. అటూ ఇటూ పరుగెత్తింది. చివరికి దాన్ని వదిలేయడంతో ఊపిరి పీల్చుకుంది. ఆ విషయాన్ని కూడా రెబెక్కా పోస్ట్ చేసింది.
ఆ విషయం తెలిసిన పోలీసులు.. ఆమెను అరెస్టు చేసి విచారించగా.. జరిగిన విషయాన్ని వెల్లడించింది. దీంతో ముగ్గురిపై జంతు సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న జెర్రీడ్, కెవిన్ కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. తాజాగా వారిపై వారెంట్ జారీ చేశారు. ఇదిలా ఉండగా, టెక్సస్‌లో 2017 నుంచి బాస్టియాలిటీ(జంతువులపై క్రూరంగా ప్రవర్తించడం)పై నిషేధం విధించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.