మహిళ లోదుస్తుల్లో బంగారం... శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అరెస్ట్

ఆమె వద్దనుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.11లక్షల విలువైన బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

news18-telugu
Updated: February 19, 2020, 4:39 PM IST
మహిళ లోదుస్తుల్లో బంగారం... శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అరెస్ట్
మహిళ లోదుస్తుల్లో బంగారం... శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అరెస్ట్
  • Share this:
అంతర్జాతీయ విమానాశ్రయాల్లో భద్రతను ఎంత కట్టుదిట్టం చేసినా... కొందరు మాత్రం విదేశాల నుంచి అక్రమంగా బంగారం వెండి వాటిని తరలించే ప్రయత్నాలు మానుకోవడంలేదు. తాజాగా లక్షలు విలువ చేసే బంగారాన్ని తరలిస్తూ ఓ మహిళ కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఆమె వద్దనుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.11లక్షల విలువైన బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా దుబాయ్‌ నుంచి శంషాబాద్‌ వచ్చిన విమానంలో ఓ మహిళా ప్రయాణికురాలిని తనిఖీలు చేసిన భద్రతా సిబ్బంది ఆమె వద్ద బంగారం ఉన్నట్లు గుర్తించారు. మహిళను అదుపులోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. మహిళ లోదుస్తుల్లో లోదుస్తులు, షూల్లో పెట్టిన 290 గ్రాముల బరువున్న రెండు బంగారం బిస్కెట్లు, ఆభరణాలు బయటపడ్డాయి. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు రూ.11లక్షల వరకు ఉంటుందని కస్టమ్స్‌ అధికారులు వెల్లడించారు.

అంతకుముందు కూడా అనేక సందర్భాల్లో శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. చెన్నై ఎయిర్ పోర్టులో కూడా ఇలాంటి బంగారం అక్రమ రవాణా వెలుగు చూసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల వద్ద పెద్ద మొత్తంలో బంగారాన్ని పట్టుకున్నారు.

First published: February 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు