• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • WOMAN ARRESTED AFTER BODIES OF THREE CHILDREN FOUND AT VIENNA PROPERTY SU

ముగ్గురు పిల్లలను హత్యచేసి పోలీసులకు సమాచారం ఇచ్చిన తల్లి

ప్రతీకాత్మక చిత్రం

కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే దారుణానికి ఓడిగట్టింది. పదేళ్లు కూడా దాటని తన ముగ్గురు కూతుళ్లను హత్య చేసింది.

  • Share this:
    కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే దారుణానికి ఓడిగట్టింది. పదేళ్లు కూడా దాటని తన ముగ్గురు కూతుళ్లను హత్య చేసింది. అంతేకాకుండా ముగ్గరు పిల్లల్ని చంపానని, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. ఈ ఘటన ఆస్ట్రియాలోని వియన్నాలోని ఓ ఇంట్లో చోటుచేసుకుంది. వివరాలు.. 31 ఏళ్ల ఓ మహిళ శనివారం పోలీసులకు ఫోన్ చేసింది. తన ముగ్గురు పిల్లల్ని చంపానని, తాను కూడా చనిపోతున్నానని చెప్పింది. దీంతో వియన్నా పోలీసులు అప్రమత్తమయ్యారు. డోనాస్టాడ్ జిల్లాలో మహిళ నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ తనను తానే గాయపరుచుకున్న మహిళను అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను పోలీసు కస్టడీకి తరలించారు.

    ఇక, ఘటన స్థలంలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. తీవ్ర గాయాలతో ప్రాణాలతో పోరాడుతున్న ఓ బాలికను ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆ బాలిక మృతిచెందింది. చనిపోయిన వారిలో తొమ్మిదేళ్లు, మూడేళ్ల చిన్నారులతోతో పాటు.. ఎనిమిది నెలల పసికందు కూడా ఉంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ ప్రారంభించారు. నిందితురాలుగా ఉన్న మహిళ.. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉందా అనే విషయంపై పోలీసులు నిర్ధారణకు రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ దారుణ ఘటనకు గల కారణాలు తెలియలేదని పోలీసులు చెప్పారు.
    Published by:Sumanth Kanukula
    First published: