ఎన్నారై భర్త బండారాన్ని బయటపెట్టిన భార్య.. ఫోటోలు మార్ఫింగ్ చేసిన మరిది..

ఇదే క్రమంలో అనూష మరిది ఏకంగా ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఇలా గొడవలు జరుగుతుండగానే.. మధు రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని ఆమెకు తెలిసింది.

news18-telugu
Updated: October 18, 2019, 12:22 PM IST
ఎన్నారై భర్త బండారాన్ని బయటపెట్టిన భార్య.. ఫోటోలు మార్ఫింగ్ చేసిన మరిది..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: October 18, 2019, 12:22 PM IST
అదనపు కట్నం కోసం కొన్నాళ్లుగా తనను వేధిస్తున్న ఎన్నారై భర్త.. మరో యువతిని పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లేందుకు సిద్దమయ్యాడని ఓ వివాహిత కృష్ణా జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసింది.భర్తను ఎలాగైనా అడ్డుకుని తన న్యాయం చేయాలని కోరింది. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా పెనమలూరుకి చెందిన అనూషకి మధు అనే యువకుడితో 2015,అక్టోబర్‌లో వివాహం జరిగింది. వివాహం తర్వాత మలేషియా వెళ్లిన దంపతులు కొంతకాలం అక్కడే ఉన్నారు. ఏమైందో ఏమో తెలియదు కానీ కొంత కాలానికి మధు ఒక్కడే ఇండియా తిరిగొచ్చేశాడు. ఆ తర్వాత కొద్దిరోజులకు ఇండియా వచ్చిన అనూష.. నేరుగా అత్తింటికి వెళ్లింది. అయితే అత్తింటివారు కూడా మధుకే వంత పాడారు.

అదనపు కట్నం తీసుకురావాల్సిందేనని వేధించారు. ఇదే క్రమంలో అనూష మరిది ఏకంగా ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఇలా గొడవలు జరుగుతుండగానే.. మధు రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని ఆమెకు తెలిసింది. దీంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.వాళ్లిద్దరూ జర్మనీ వెళ్లేందుకు వీసా కూడా పొందారని.. త్వరలోనే ఇండియా నుంచి వెళ్లిపోతారని.. ఆలోపే వారిని పట్టుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది. మరోవైపు అనూష ఆరోపణలను మధు ఖండించాడు. తనకు ఏ అమ్మాయితోనూ ఎలాంటి సంబంధం లేదన్నాడు. అనూష ఆరోపిస్తున్న అమ్మాయి తనకు కేవలం స్నేహితురాలు అని చెప్పాడు. ఘటనపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

First published: October 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...