HOME » NEWS » crime » WOMAN AND SON ATTEMPTS SELF IMMOLATION NEAR ODISHA ASSEMBLY SU

అసెంబ్లీ ఎదుట తల్లి, కొడుకు ఆత్మహత్య యత్నం.. వారంలో ఇది మూడో ఘటన

ఓ తల్లి కొడుకు అసెంబ్లీ సమీపంలో ఆత్మహత్యకు యత్నించడం తీవ్ర కలకలం రేపింది. ఒంటిపై కిరోసిన్ పోసుకున్న వారిని అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది.

news18-telugu
Updated: November 29, 2020, 6:41 AM IST
అసెంబ్లీ ఎదుట తల్లి, కొడుకు ఆత్మహత్య యత్నం.. వారంలో ఇది మూడో ఘటన
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ తల్లి కొడుకు అసెంబ్లీ సమీపంలో ఆత్మహత్యకు యత్నించడం తీవ్ర కలకలం రేపింది. ఒంటిపై కిరోసిన్ పోసుకున్న వారిని అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఒడిశా అసెంబ్లీ పరిసరాల్లోని ఐజీ పార్క్ వద్ద శనివారం చోటుచేసుకుంది. ఆత్మహత్యకు యత్నించిన వారిని జగత్‌సింగ్‌పూర్ జిల్లాలోని కుజాంగ్‌కు చెందిన సులోచన దాస్, ఆమె కుమారుడు సుబ్రత్ దాస్‌గా అధికారులు గుర్తించారు. వివరాలు.. సులోచన దాస్ ఇంకో కుమారుడు 2019 జూలై 20న హత్యకు గురయ్యాడు. అయితే దీనిని తొలుత అనుమాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత విచారణను ముగించారని సులోచన ఆరోపించారు. "నా కొడుకును 10 నుంచి 12 మంది కలిసి దారుణంగా చంపారు. నిందితుల్లో ఒకరు డీఎస్పీ ర్యాంక్ అధికారి కొడుకు కావడంతో పోలీసులు వారిని రక్షించుకుంటున్నారు. పోలీసు అధికారులు మాతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో తన కొడుకు ప్రాణాలు కోల్పోయాడని విచారణ పూర్తి చేశారు"అని సులోచన ఆరోపించారు.

ఇక, వారం రోజుల వ్యవధిలో అసెంబ్లీ సమీపంలో మరో రెండు ఆత్మహత్య యత్నాలను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ శీతకాల సమావేశాలు జరుగుతున్న వేళ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఎలాంటి ఆందోళనలకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు.

ఇక, శుక్రవారం రోజున కటక్ జిల్లా గురుదిజాతియాకు చెందిన ముగ్గరు రైతులు అసెంబ్లీ సమీపంలో ఆత్మహత్యకు యత్నించారు. కోపరేటివ్ బ్యాంక్ నుంచి తమ పేరిట కొందరు మోసపూరిత రుణాలను తీసుకున్నారని.. ఇప్పుడు వాటిని తాము చెల్లించాలని అంటున్నారని ఆరోపించారు. ఈ విషయంలో పోలీసులు న్యాయం చేయడం లేదని తెలిపారు. ఇదేవిధంగా మంగళవారం రోజున నాయఘర్ జిల్లాలో హత్యకు గురైన బాలిక తల్లిదండ్రులు కూడా అసెంబ్లీ ముందు ఆత్మహత్యకు యత్నించారు. నిందితుడు అధికారి పార్టీ నాయకుడి సహాయకుడు కావడంతో పోలీసులు అతడిని రక్షిస్తున్నారని ఆరోపించారు.
Published by: Sumanth Kanukula
First published: November 29, 2020, 6:41 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading