అతడు ఓ డీఎంకే నేత కొడుకు.. ప్రస్తుతం ఓ కాలేజ్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. అయితే అతడు ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమె భర్తపై హత్యాయత్నం చేశాడు. ఇందుకు అతడు తన స్నేహితుల సాయం తీసుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన తమిళనాడు ఈరోడ్‌లోని సిరువల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సచ్చిదానందన్.. డీఎంకే నేత, ఆయలూరు పంచాయితీ మాజీ అధ్యక్షుడు, చిన్నస్వామి కుమారుడు. సచ్చిదానందన్ ఓ ప్రైవేజ్ కాలేజ్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. అతడు మైథిలి అనే పెళ్లైన మహిళతో పరిచయం పెంచుకున్నాడు. ఈ పరిచయం కాస్తా.. సచ్చిదానందన్, మైథిలీ మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. కొన్ని రోజుల తర్వాత ఈ విషయం మైథిలీ భర్త శ్రీనివాసన్‌కు తెలిసింది. దీంతో మైథిలీ, శ్రీనివాసన్‌లు గొడవపడ్డారు. వివాహేతర సంబంధం మానుకోవాలని, సచ్చిదానందన్తో దూరంగా ఉండాలని మైథిలీని శ్రీనివాసన్ హెచ్చరించాడు. పలుమార్లు ఈ విషయంపై భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతూ వచ్చాయి.
దీంతో మైథిలీ.. తన భర్తతో కలిసి ఉంటూనే, ప్రియుడు సచ్చిదానందన్తో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చింది. అయితే ఈ సమయంలో సచ్చిదానందన్ నేరానికి పాల్పడ్డాడు. మైథిలీ భర్త శ్రీనివాసన్‌పై హత్య చేయాలని చూశాడు. ఈ క్రమంలోనే తన నలుగురు స్నేహితులతో కలిసి శ్రీనివాసన్‌ను కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు.అయితే స్థానికులు సకాలంలో స్పందించి.. శ్రీనివాసన్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు.
ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. శ్రీనివాసన్ భార్య మైథిలీపై అనుమానం కలగడంతో ఆమెను విచారించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత పోలీసులు సచ్చిదానందన్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం ఇద్దరిని స్థానిక కోర్టు ముందు హాజరుపరిచారు. వారు నేరాన్ని అంగీకరించారు. ఇద్దరూ కోయంబత్తూరులోని జైలులో ఉన్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇతర నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.