ప్రియుడితో ఎఫైర్ కోసం ఆమె ఎంత దారుణం చేసిందంటే..

ఇద్దరి మధ్య ఉన్న పరిచయం రీత్యా.. శివ రామారావు ఇంటికి వస్తూ పోతుండేవాడు. ఇదే అదనుగా శివ రామారావు భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసిన రామారావు భార్యను మందలించాడు. అయితే ఆమె మాత్రం శివ మాయలో పడిపోయింది.

news18-telugu
Updated: August 27, 2019, 10:24 AM IST
ప్రియుడితో ఎఫైర్ కోసం ఆమె ఎంత దారుణం చేసిందంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వివాహేతర సంబంధాలు హత్యలకు దారితీస్తున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ షాపూర్‌నగర్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో భర్తను హత్య చేయించిందో భార్య. బతుకుదెరువు నిమిత్తం పొరుగు రాష్ట్రం నుంచి నగరానికి వచ్చి.. మరొకరి మోజులో భర్తను చంపిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నగర శివారులోని తూంకుంటలో నక్క రామారావు(45), అతని భార్యా పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. మేస్త్రీగా పనిచేసే రామారావుకు శివ అనే స్నేహితుడు ఉన్నాడు. ఇద్దరి మధ్య ఉన్న పరిచయం రీత్యా.. శివ రామారావు ఇంటికి వస్తూ పోతుండేవాడు. ఇదే అదనుగా శివ రామారావు భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసిన
రామారావు భార్యను మందలించాడు. అయితే ఆమె మాత్రం శివ మాయలో పడిపోయింది. ఇద్దరు కలిసి రామారావును అంతం చేయాలనుకున్నారు.

రామారావు భార్య శివకు రూ.5వేలు ఇచ్చి భర్తను హత్య చేయాల్సిందిగా చెప్పింది. దీంతో ఈ నెల 14న శివ రామారావును మద్యం తాగడానికి పిలిచాడు. శామీర్‌పేట మండల పరిధిలోని ఓ వెంచర్‌లో ఇద్దరు కలిసి మద్యం సేవించారు. రామారావు మద్యం మత్తులో ఉండటంతో.. మద్యం సీసాతో శివ అతని గొంతులో పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో రామారావు అక్కడే మృతి చెందాడు. ఆపై నగరం నుంచి తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు. రామారావు భార్యను పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. అసలు విషయం బయటపెట్టింది. దీంతో ఆమెతో పాటు శివను కూడా అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు.


First published: August 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు