• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • WOMAN AND HER 23 YEAR OLD BOYFRIEND ARRESTED IN ATTEMPT TO MURDER CASE IN DELHI FULL DETAILS HERE HSN

ఆమె వయసు 41 ఏళ్లు.. ఆ కుర్రాడి వయసు 23 ఏళ్లు.. ఇద్దరి మధ్య సంబంధం వల్ల ఎంత ఘోరం జరిగిందంటే..!

ఆమె వయసు 41 ఏళ్లు.. ఆ కుర్రాడి వయసు 23 ఏళ్లు.. ఇద్దరి మధ్య సంబంధం వల్ల ఎంత ఘోరం జరిగిందంటే..!

ప్రతీకాత్మక చిత్రం

45 ఏళ్ల వయసున్న భీమ్ రాజ్ అనే వ్యక్తి బీఎస్ఈస్ రాజధాని పవర్ కాంట్రాక్ట్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతడికి 41 ఏళ్ల భాటియా అనే భార్య ఉంది. అయితే వీరిద్దరి మధ్యలోకి 23 ఏళ్ల కుర్రాడు రోహన్ ఎంట్రీతో కథ చాలా మలుపులు తిరిగింది.

  • Share this:
    దేశ రాజధానిలో సౌత్ ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీ ప్రాంతంలో బుధవారం ఓ వ్యక్తిపై తుపాకీ కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఘటనకు పాల్పడిన వ్యక్తి వాడిన బైక్ నెంబర్ కూడా సరైనది కాకపోవడం, దాన్ని ఆ దుండగుడు మార్ఫింగ్ చేయడంతో అతడు ఎవరన్నది త్వరగా తేల్చలేకపోయారు. ఎట్టకేలకు పోలీసులు కొన్సి సాంకేతిక ఆధారాల ఆధారంగా కేసును తేల్చేశారు. ఓ వివాహేతర సంబంధమే ఈ దారుణ ఘటనకు అసలు కారణమని వెల్లడించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. చిరాగ్ ఢిల్లీలో 45 ఏళ్ల వయసున్న భీమ్ రాజ్ అనే వ్యక్తి బీఎస్ఈస్ రాజధాని పవర్ కాంట్రాక్ట్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతడికి 41 ఏళ్ల భాటియా అనే భార్య ఉంది. అయితే వీరిద్దరి మధ్యలోకి 23 ఏళ్ల కుర్రాడు రోహన్ ఎంట్రీతో కథ చాలా మలుపులు తిరిగింది. 41 ఏళ్ల భాటియాకు 23 ఏళ్ల రోహన్ తో వివాహేతర సంబంధం ఏర్పడింది.

    వీరిద్దరి గురించి భీమ్ రాజ్ కు తెలిసి భార్యను మందలించాడు. చేయి చేసుకున్నాడు కూడా. దీంతో ఆమె మనస్తాపానికి గురయింది. తన ప్రియుడు రోహన్ తో విషయం చెప్పి, భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది. దీంతో రోహన్ తన కాంటాక్టులను ఉపయోగించి ఓ దేశీయ తుపాకీని కొన్నాడు. బైకు నెంబర్ ను మార్చేశాడు. బుధవారం భీమ్ రాజ్ కారులో వెళ్తుండగా బైక్ పై వెంబడించాడు. కారుకు ఎదురుగా నిలబడి మరీ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో భీమ్ రాజ్ తీవ్రంగా గాయాలపాలయ్యాడు. ఈ ఘటన కాస్తా సీసీ కెమెరాల్లో రికార్డయింది. పోలీసుల ఆ బైక్ ఆధారంగా అతడెవరన్నది గుర్తుపట్టలేకపోయారు. కానీ సాంకేతిక ఆధారాల ద్వారా నిందితుడిని బుధవారం సాయంత్రమే అరెస్ట్ చేశారు. అయితే రోహన్ మాత్రం పోలీసులకు కట్టుకథను అల్లాడు.
    ఇది కూడా చదవండి: ఇంట్లో నా భర్త నిద్రపోతున్నాడని చెప్పినా బలవంతం చేయడంతో.. ప్రియుడిని లోపలికి రానిచ్చిన భార్య.. ఆ తర్వాత..

    ’కొద్ది రోజుల క్రితం జరిగిన ఓ చిన్న యాక్సిడెంట్ లో నాకు, భీమ్ రాజ్ కు గొడవ జరిగింది. అందుకే అతడిని చంపాలనుకున్నా‘ అంటూ ఓ కథను అల్లాడు. ప్రేయసిని తప్పించేందుకు స్కెచ్ వేశాడు. అయితే ఈ విషయంలో పోలీసులకు అనుమానం రావడంతో, తమదైన శైలిలో పోలీసులు విచారిస్తే అసలు నిజం చెప్పేశాడు. తనకు, భాటియాకు ఉన్న అక్రమ సంబంధాన్ని గురించి వెల్లడించి, ఆమె ప్రోద్భలం వల్లే ఈ దారుణానికి పాల్పడినట్టు స్పష్టం చేశాడు. దీంతో ఆమెను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో భీమ్ రాజ్ చికిత్స తీసుకుంటున్నాడు. అతడి పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు.
    ది కూడా చదవండి: బ్యూటీషియన్ ఆత్మహత్య కేసులో షాకింగ్ నిజాలు.. బయటకు వెళ్లకుండా కూతురు జుట్టు కత్తిరించిన తల్లిదండ్రులు..
    Published by:Hasaan Kandula
    First published: