WOMAN AND HER 2 YEAR OLD BOY BURNT ALIVE BY BROTHER IN LAW FOR PROTESTING SEXUAL ASSAULTIN IN DINDIGUL TAMILNADU MKS
Dindigul: తమ్ముడి భార్యపై కన్నేసిన అన్న.. కోరిక తీర్చలేదని తల్లీబిడ్డల్ని కిరాతకంగా..
నిందితుడు కరుప్పయ్య
సొంత తమ్ముడి భార్యపై కన్నేసిన ఓ కామాందుడు తన లైంగిక కోరిక తీర్చలేదనే కోపంతో ఆమెతోపాటు రెండేళ్ల పసి బిడ్డను దారుణంగా నరికేసి, బతికుండగానే వారి శరీరాలకు నిప్పుపెట్టాడు. వివరాలివే..
మహిళలపై లైంగిక అకృత్యాలకు సంబంధించి మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. సొంత తమ్ముడి భార్యపై కన్నేసిన ఓ కామాందుడు తన లైంగిక కోరిక తీర్చలేదనే కోపంతో ఆమెతోపాటు రెండేళ్ల పసి బిడ్డను దారుణంగా నరికేసి, బతికుండగానే వారి శరీరాలకు నిప్పుపెట్టాడు. ఈ ఘోర సంఘటన తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు చెప్పిన వివరాలివి..
దిండిగల్ జిల్లా నత్తం సమీపంలోని మలయనూరు వలసు ప్రాంతానికి చెందిన నల్లపిచ్చన్ కు ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు కరుప్పయ్య (30) నిత్యం తాగుతూ జులాయిగా తిరిగేవాడు. దీంతో అతనికి పెళ్లికాలేదు. చిన్నకొడుకు శివకుమార్ (27) కు కొన్నేళ్ల కిందట అంజలి (21)అనే మహిళతో వివాహం జరిగింది. శివకుమార్, అంజలి దంపతులకు మలర్(2) అనే రెండేళ్ల పాప ఉంది. అంజలి రెండోసారి గర్భందాల్చింది. ఘటన జరిగిన నాటికి ఆమె నాలుగు నెలల గర్భిణి.
చింతపండు వ్యాపారం చేసే శివకుమార్ తరచూ ఊళ్లు తిరుగుతుంటాడు. అంజలి ఇంటి వద్దే ఉంటూ మేకలను కాస్తూ, బిడ్డను చూసుకునేది. శనివారం సాయత్రం మేకలు కాయడానికి వెళ్లిన అంజలి, ఆమె రెండేళ్ల కూతురు తిరిగి ఇంటికి రాలేదు. పొద్దుపోయిన తర్వాత బంధువులు, గ్రామస్తులు గాలించగా, సమీపంలోని అడవిలో పొగలు కనిపించడంతో అక్కడికెళ్లి చూడగా తల్లీబిడ్డ కాలిన స్థితిలో విగత జీవులుగా కనిపించారు.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టంకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శివకుమార్ అన్న కరుప్పయ్యనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. అతణ్ని అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరుప్పయ్య చాలా కాలంగా తమ్ముడి భార్య అంజలిపై కన్నేశాడు. అదను కోసం ఎదురు చూస్తూ, శనివారం నాడు ఆమె చంటిబిడ్డతో కంటబడటంతో బలవంతం చేశాడు.
లైంగిక దాడిని అంజలి తీవ్రంగా ప్రతిఘటించడంతో ఉన్మాదిలా మారిపోయిన కరుప్పయ్య తన గొడ్డలితో ఆమెను నరికేశాడు. ఆ తర్వాత రెండేళ్ల పాపను కూడా నరికాడు. వాళ్లిద్దరూ ప్రాణాలతో ఉండగానే చెత్తపేర్చి, శరీరాలకు నిప్పు పెట్టి పారిపోయాడు. నేరం తానే చేసినట్లు నిందితుడు వాగ్మూలంలో పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.