హోమ్ /వార్తలు /క్రైమ్ /

భర్త సమక్షంలోనే దారుణం జరిగింది.. ఆ ప్రతీకారం తీర్చుకోవడానికే ఇలా.. మహిళ సంచలన ఆరోపణలు..

భర్త సమక్షంలోనే దారుణం జరిగింది.. ఆ ప్రతీకారం తీర్చుకోవడానికే ఇలా.. మహిళ సంచలన ఆరోపణలు..

8. అయితే గ‌తంలోనూ బ్రౌన్‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 2009లో ఈ జంట డేటింగ్ చేస్తున్నప్పుడు గాయని రిహన్నాపై దాడి చేసినందుకు బ్రౌన్ నేరాన్ని అంగీకరించాడు, ఈ సంఘటన ఆమె గాయపడిన ముఖం యొక్క ఫోటో విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ముఖ్యాంశాలు చేసింది.(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

8. అయితే గ‌తంలోనూ బ్రౌన్‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 2009లో ఈ జంట డేటింగ్ చేస్తున్నప్పుడు గాయని రిహన్నాపై దాడి చేసినందుకు బ్రౌన్ నేరాన్ని అంగీకరించాడు, ఈ సంఘటన ఆమె గాయపడిన ముఖం యొక్క ఫోటో విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ముఖ్యాంశాలు చేసింది.(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

ఓ మహిళ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. భర్త సమక్షంలోనే అతని స్నేహితుడు తనపై అత్యాచారం చేసినట్టు తెలిపింది.

  ఓ మహిళ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. భర్త సమక్షంలోనే అతని స్నేహితుడు తనపై అత్యాచారం చేసినట్టు తెలిపింది. తన భర్తకు తెలిసే ఇదంతా జరిగిందని చెప్పింది. తర్వాత తనను హత్య చేసే ప్రయత్నం కూడా జరిగిందని తెలిపింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) అమేథిలోని బజార్ శుక్లా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. బజార్ శుక్లా పట్టణంలో నివసిస్తున్న ఓ వివాహతకు తన భర్త శ్రావణ్‌ కుమార్ కుటుంబంతో వివాదం ఉంది. ఇందుకు సంబంధించిన కేసు ఫ్యామిలీ కోర్టు(Family Court)లో పెండింగ్‌లో ఉందని బాధితురాలు తెలిపింది. ఈ క్రమంలోనే తనపై ప్రతీకారం తీర్చుకునేందుకు తన భర్త అతని స్నేహితులతో ఈ దారుణానికి ఒడిగట్టాడని చెప్పింది.

  ఆగస్టు 24 తన భర్త శ్రావణ్ కుమార్, అతని స్నేహితులు(Friends) రామ్ గోపాల్ యాదవ్, బబ్బన్ తివారీ.. ఇంట్లోకి ప్రవేశించారని తెలిపింది. వారితో పాటు తనకు తెలియని మరో వ్యక్తి కూడా ఉన్నట్టుగా ఆమె చెప్పింది. ఆ తర్వాత వారు తనపై దాడి చేశారని.. మొదట విచక్షణ రహితంగా కొట్టారని చెప్పింది. ఆ తర్వాత శ్రావణ్ కుమార్ స్నేహితులలో ఒకరైన బబ్బన్ తివారీ.. తనపై బలవంతంగా అత్యాచారానికి(Rape) పాల్పడ్డాడని ఆరోపించింది. ఆ తర్వాత భర్త స్నేహితులు అంతా కలిసి తనపై పెట్రోల్(Petrol) పోసి సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారని తెలిపింది. కానీ తన అరుపులు విని స్థానికులు అక్కడికి చేరుకోవడంతో.. నిందితులు అక్కడి నుంచి పారిపోయినట్టుగా తెలిపింది.

  Shocking: ఛీ.. ఛీ.. ఈ యువతి చేసిన పాడు పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. తమ్ముడిని బలవంతంగా..


  ఈ ఘటనకు సంబంధించి 112 డయల్‌ చేసి స్థానిక బజార్ శుక్లా పోలీసులకు విషయాన్ని చెప్పినట్టుగా బాధితురాలు తెలిపింది. అయితే వారు కేసు నమోదు చేయడానికి బదులు.. ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని ఆరోపించింది. దీంతో తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని.. ఈ క్రమంలోనే అమేథి(Amethi) పోలీసు సూపరింటెండెంట్ దినేష్ సింగ్‌కు జరిగిన విషయాన్ని చెప్పినట్టుగా బాధితురాలు తెలిపింది. ఇక, ఎస్పీ దినేష్ సింగ్ ఆదేశాల మేరకు పోలీసులు నిందితుల మీద కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నట్టు పోలీసులు తెలిపారు.

  ఆత్మహత్య చేసుకుంటానని పోలీసులకు వీడియో పంపిన TikTok స్టార్.. అర్దరాత్రి పోలీసులు ఆమె ఇంటికి వెళ్లేసరికి..


  ఈ విషయం మొత్తం ఆస్తికి సంబంధించిందని బజార్‌ శుక్లా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ప్రేమ్‌చంద్ చెప్పారు. బాధితురాలి ఫిర్యాదుపై లోతైన దర్యాప్తు కొనసాగుతుందని అన్నారు. వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Crime news, RAPE, Uttar pradesh

  ఉత్తమ కథలు