కంటికి రెప్పలా కాపాడాల్సిన యువకులే తమ సోదరిని బెదిరించి (rape on girl) అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం ముంబైలో (mumbai) జరిగింది. ప్రభుత్వాలు మహిళలు, అమ్మాయిల భద్రత కోసం దిశ, పోక్సో, నిర్బయ, ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన కామాంధులు మాత్రం మారడం లేదు. ప్రతి రోజు మహిళలపై అఘాయిత్యాలు, దారుణాల ఘటన వెలుగు చూస్తునే ఉన్నాయి. మహిళలు ప్రతి చోట వేధింపులకు గురౌతున్నారు. కొన్ని చోట్ల అత్యంత నీచంగా తెలిసిన వారే దారుణాలకు పాల్పడుతున్నారు. మరికొన్ని చోట్ల సొంత మనుషులే పశువు కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. తమ వారిపైనే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. ముంబైలో (mumbai) ఈ అమానుషం జరిగింది. ధారవిలో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. అనిల్ చౌహన్ , నీలేష్ లు ఇద్దరు తమ, సోదరిపై లైంగికంగా వేధించారు. ఆ తర్వాత.. ఆమెను ఇంట్లో ఎవరు లేనిది చూసి, కత్తితో బెదిరించి అత్యాచారం చేశారు. ఈ ఘటనను వీడియో కూడా తీశారు. ఆమెను బెదిరించారు. ఎవరికైన చెబితే చంపేస్తామంటూ హెచ్చరించారు.
దీంతో బాలిక భయపడిపోయి కొన్ని రోజులు దారుణం ఎవరికి చెప్పలేదు. బాలిక ప్రవర్తన అనుమానకరంగా ఉండటంతో ఆమెను తల్లిదండ్రులు అడిగారు. దీంతో తన బాధను చెప్పుకుంది. ఈ మేరకు ఘటన వెలుగులోనికి రావడంతో పోలీసుల వరకు వెళ్లింది. దీంతో పోలీసులు పోక్సో కింద కేసు నమోదు చేసి అనిల్, నీలేష్ లను అరెస్టు చేశారు.
12 బాలిక తన తల్లితో పాటు తాత దగ్గర ఉంటుంది. ఆమె తండ్రి 12 ఏళ్ల క్రితమే మరణించాడు. బాలికి తల్లి మానసిక వికలాంగురాలు. ఆమెతో ఎవరితో సరిగ్గా మాట్లాడదు. బాలిక తాత.. తాగుడుకు బానిసయ్యాడు. ఇతను వీరిని పోషిస్తుంటాడు. ఈ క్రమంలో.. తాత.. మరో ఇద్దరితో కలిసి ఇంట్లోనే బాలికపై అత్యాచారానికి (Rapes girl) పాల్పడేవారు. నెలల తరబడి బాలికపై అఘాయిత్యం జరిపారు. ఈ క్రమంలో బాలిక ఇటీవల పాఠశాలలో అస్వస్థతకు గురికావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు.
ఆమెను చూసిన వైద్యులు 5 నెలల గర్భవతి (pregnant)అని తెలిపారు. దీంతో పాఠశాల సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణలో బాలిక షాకింగ్ విషయాలు (shocking) వెల్లడించింది. తన తాత.. మరో ఇద్దరు కలిసి తనపై అత్యాచారానికి పాల్పడుతున్నారని తెలిపింది. తాత.. స్నేహితుడు రాంలాల్ భీల్ (50), అజయ్ బైర్వా (20), వీరు గత నెలలుగా బెదిరిస్తు.. అఘాయిత్యానికి పాల్పడుతున్నారని బాలిక వాపోయింది. వెంటనే పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి వీరిని అరెస్టు చేశారు. ఈ సంఘటనతో స్థానికంగా తీవ్ర దుమారం చెలరేగింది.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.