హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking: పాపం.. ఈ యువతికి జరిగింది మాములు ద్రోహం కాదు.. నమ్మించి గొంతు కోయడమంటే ఇదేనేమో..

Shocking: పాపం.. ఈ యువతికి జరిగింది మాములు ద్రోహం కాదు.. నమ్మించి గొంతు కోయడమంటే ఇదేనేమో..

మురళీధరన్, జ్ఞానమోజి, పక్కన జ్ఞానమోజి (ఫైల్ ఫొటో)

మురళీధరన్, జ్ఞానమోజి, పక్కన జ్ఞానమోజి (ఫైల్ ఫొటో)

వాళ్లిద్దరూ వరుసకు బావామరదళ్లు. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్నారు. రెండు కుటుంబాలు కూడా పెద్దయ్యాక పెళ్లి చేయాలని నిర్ణయించాయి. దీంతో.. గత 12 ఏళ్ల నుంచి ఇద్దరూ ఒకటిగా మెలిగారు. చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాలు చేస్తున్నారు. అయినా వారి దారులు ఒకటే. కలిసే ఉండేవారు. కలిసి ఒకే రూంలో ఉండేవారు.

ఇంకా చదవండి ...

ధర్మపురి: వాళ్లిద్దరూ వరుసకు బావామరదళ్లు. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్నారు. రెండు కుటుంబాలు కూడా పెద్దయ్యాక పెళ్లి చేయాలని నిర్ణయించాయి. దీంతో.. గత 12 ఏళ్ల నుంచి ఇద్దరూ ఒకటిగా మెలిగారు. చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాలు చేస్తున్నారు. అయినా వారి దారులు ఒకటే. కలిసే ఉండేవారు. కలిసి ఒకే రూంలో ఉండేవారు. పెళ్లి చేయాలని వీళ్ల చిన్నప్పుడే అనుకోవడంతో ఇరు కుటుంబాలు కూడా వాళ్ల కలయికకు అడ్డు చెప్పలేదు.

ఆ కలయిక కారణంగా ఆ యువతి రెండుసార్లు అబార్షన్ కూడా చేయించుకోవాల్సి వచ్చింది. కానీ.. అంతలా నమ్మిన ఆ యువతికి ఆమె బావ కుటుంబం ఊహించని షాకిచ్చింది. ఆమెకు ఊహ తెలిసినప్పటి నుంచి ‘నువ్వే మా కోడలు’ అని చెప్పిన ఆ కుటుంబం తాజాగా మాట మార్చింది. ఆమెను కాదని మరో అమ్మాయితో కొడుకుకు పెళ్లి నిశ్చయించింది.

దీంతో.. ఆ చేదు నిజాన్ని భరించలేక ప్రియుడు, తనకు కాబోయే భర్త అని ఆమె ఎన్నో కలలు కన్న బావ ఇంటి ముందే ఆ యువతి విషం తాగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన తమిళనాడులోని ధర్మపురి జిల్లా పరిధిలో వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని ధర్మపురి ప్రాంతానికి చెందిన మురళీధరన్ అనే యువకుడు, జ్ఞానమోజి అనే యువతి వరుసకు బావామరదళ్లు. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్నారు. రెండు కుటుంబాలు కూడా పెద్దయ్యాక వాళ్లకు పెళ్లి చేయాలని భావించాయి.

మురళీధరన్, జ్ఞానమోజి ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇటీవల కరోనా కారణంగా కంపెనీలు ‘వర్క్ ఫ్రం హోం’ ప్రకటించడంతో ఇద్దరూ ఇళ్లకెళ్లారు. అయితే.. ఈలోపే ఉద్యోగాలు చేస్తూ బెంగళూరులో ఒకే ఇంట్లో మురళీధరన్, జ్ఞానమోజి కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో పలుమార్లు శారీరకంగా కలిశారు. జ్ఞానమోజి రెండుసార్లు అబార్షన్ కూడా చేయించుకోవాల్సి వచ్చింది. జ్ఞానమోజి కూడా తన బావతోనే పెళ్లి జరుగుతుందన్న ఉద్దేశంతో.. కాబోయే వాడేనన్న కారణంగా అడ్డు చెప్పలేదు.

12 ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట ఇంటికెళ్లాక ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. మురళీధరన్‌కు అతని తల్లిదండ్రులు మరో యువతితో పెళ్లి ఖరారు చేశారు. ఈ విషయం తెలిసి జ్ఞానమోజి నేరుగా మురళీధరన్ ఇంటికెళ్లి అతని తల్లిదండ్రులతో మాట్లాడింది. బావను తాను పెళ్లి చేసుకుంటానని.. తన వల్ల రెండుసార్లు అబార్షన్ కూడా చేయించుకున్నానని.. తనకు అన్యాయం చేయొద్దని అతని తల్లిదండ్రులను బతిమాలింది. అయినప్పటికీ మురళీధరన్ తల్లిదండ్రులు ఆమె అభ్యర్థనను తిరస్కరించారు.

ఇది కూడా చదవండి: Doctor: నాలుగు పేజీల సూసైడ్ నోట్.. సిరంజితో శరీరంలోకి విషం.. సూసైడ్ నోట్ మొత్తం ఆమె గురించే..

మురళీ పెళ్లి వేరే అమ్మాయితో నిశ్చయించామని.. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడని తేల్చి చెప్పారు. మురళీధరన్ కూడా పెద్దల మాటకు అడ్డు చెప్పలేదు. తల్లిదండ్రుల మాటకే కట్టుబడి జ్ఞానమోజికి సమాధానం చెప్పకుండా మిన్నకుండిపోయాడు. ఈ పరిణామం జ్ఞానమోజిని తీవ్రంగా బాధించింది. మురళీధరన్ ఇంటి ముందే వెంట తెచ్చుకున్న విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. విషం తాగి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆమెను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

అయితే.. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. జ్ఞానమోజి ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో మురళీధరన్, అతని కుటుంబంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ యువతిని కుటుంబం అంతా కలిసి మోసం చేసిందని.. ఆ కుటుంబంపై కఠిన చర్యలు తీసుకునేంత వరకూ మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని జ్ఞానమోజి కుటుంబం, బంధువులు తెగేసి చెప్పడంతో ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆ యువతి ఆత్మహత్యకు బాధ్యులైన వారికి తగిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు హామీ ఇచ్చాక ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లారు.

First published:

Tags: Crime news, Lover cheating, Lovers, Tamilnadu, Woman suicide

ఉత్తమ కథలు