హోమ్ /వార్తలు /క్రైమ్ /

New Delhi Railway Station: దేశ రాజధానిలో దారుణం.. రైల్వే స్టేషన్‌లో మహిళపై గ్యాంగ్ రేప్

New Delhi Railway Station: దేశ రాజధానిలో దారుణం.. రైల్వే స్టేషన్‌లో మహిళపై గ్యాంగ్ రేప్

న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ (ఫైల్ ఫొటో)

న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ (ఫైల్ ఫొటో)

ఆజాదీకా అమృతకాల మహోత్సవాలు మిన్నంటిన వేళ దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. నిత్యం రద్దీగా ఉండే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. వివరాలివే..

అత్యున్నత చట్టసభ పార్లమెంటు కొనసాగుతోన్న సమయంలో.. మహిళా రాష్ట్రపతి ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు జోరుగా జరుగుతుండగా.. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆజాదీకా అమృతకాల మహోత్సవాలు మిన్నంటిన వేళ దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో మరో దారుణం చోటుచేసుకుంది. నిత్యం రద్దీగా ఉండే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ (New Delhi Railway Station)లో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ దారుణానికి పాల్పడింది రైల్వే ఉద్యోగులే కావడం సర్వత్రా కలకలం రేపుతున్నది. వివరాలివే..

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని ఓ గదిలో శుక్రవారం 30 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటనకు సంబంధిచి పోలీసులు నలుగురు రైల్వే ఉద్యోగులను అరెస్ట్ చేశారు. అందులో ఇద్దరు బాధిత మహిళపై అత్యాచారం జరపగా.. మరో ఇద్దరు గది వెలుపల కాపలాగా ఉన్నారు. నిందితులను సతీష్ కుమార్ (35), వినోద్ కుమార్ (38), మంగళ్ చంద్ మీనా (33), జగదీష్ చంద్ (37)గా గుర్తించారు. వీరు నలుగురు రైల్వేలోని ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగులని పోలీసులు చెప్పారు.

Twitter Tillu : ట్విట్టర్ టిల్లూ : అట్లుంటది కేటీఆర్-బండి సంజయ్ తోని! ఈడీ దాడిపై రచ్చరచ్చ


గ్యాంగ్ రేప్ ఘటనకు సంబంధించి శుక్రవారం తెల్లవారుజామున తొలి ఫోన్ కాల్ వచ్చిందని, ఎఫ్ఐఆర్ నమోదు చేసి, 2 గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (రైల్వే) హరేంద్ర కుమార్ సింగ్ తెలిపారు. నిందితులను ఢిల్లీ కోర్టు ముందు హాజరుపరిచామని.. కోర్టు ఆదేశాలతో వారిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపామని చెప్పారు.

Farmers | Drones : రైతులకు శుభవార్త.. సబ్సిడీపై డ్రోన్లు పంపిణీ.. పూర్తి వివరాలివే..


దాదాపు రెండేళ్ల క్రితం మహిళకు ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా నిందితుల్లో ఒకరితో పరిచయం ఏర్పడిందని, రైల్వేలో ఉద్యోగం పెట్టిస్తానని ఆశ చూపి ఆ వ్యక్తి మహిళకు ఇంకా దగ్గరయ్యాడని జూలై 21న కొడుకు పుట్టినరోజు పార్టీకి ఆమెను తన ఇంటికి ఆహ్వానించారని పోలీసులు చెప్పారు. పార్టీ తర్వాత నలుగురు నిందితులు మహిళను తీసుకొని రాత్రి 10.30 గంటల సమయంలో కీర్తి నగర్ మెట్రో స్టేషన్ నుంచి తాము పనిచేసే న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్‌కు వెళ్లారి, అక్కడ ఎలక్ట్రిక్ మెయింటెనెన్స్ గదిలో దారుణానికి ఒడిగట్టారని పోలీసులు వివరించారు.

TRS | BJP : మోదీకి కేసీఆర్ మద్దతు.. తప్పు ఒప్పుకున్న కేటీఆర్.. బీఆర్ఎస్‌తో దిద్దుబాటు..


ఒకరి తర్వాత ఒకరుగా కీచకులు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఒకరు ఆమెపై అకృత్యం జరుపుతోంటే, ఇద్దరు కాపలాకాశారని, అందరికీ కఠిన శిక్షలు పడేందుకు అవసరమైన సాక్ష్యాధారాలను క్రోడీకరిస్తున్నామని డీఎస్పీ హరేంద్ర కుమార్ సింగ్ తెలిపారు. పార్లమెంట్, రాష్ట్రపతి ఎన్నికలు, ఆజాదీకా అమృతోత్సవ్ వేళ పకడ్బందీ భద్రత ఉండే దేశరాజధానిలోనే ఇలాంటి ఘటన జరగడం చర్చనీయాంశమైంది.

Published by:Madhu Kota
First published:

Tags: Delhi, Gang rape, New Delhi

ఉత్తమ కథలు