సెక్స్ చేయమంటే చేయలేదని భర్తను చితక్కొట్టిన భార్య... ఆ తర్వాత...

రాత్రి 2 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ... సంఘటనా స్థలంలో జరిగింది, తెలుసుకుని షాకైన పోలీసులు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 29, 2019, 9:45 PM IST
సెక్స్ చేయమంటే చేయలేదని భర్తను చితక్కొట్టిన భార్య... ఆ తర్వాత...
సెక్స్ చేయడం లేదని భర్తను చితక్కొట్టిన భార్య... ఆ తర్వాత...
  • Share this:
సెక్స్‌ చేయడం లేదనే కోపంతో మద్యం మత్తులో తన భర్తను చితకబాదిందో భార్య. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ సంఘటన అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో జరిగింది. శనివారం రాత్రి రెండు దాటిన తర్వాత ఎరికా యోడర్ అనే మహిళ... పోలీసులకు ఫోన్ చేసి, తన భర్త తనపై దాడి చేస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... ఆమెను గమనించగా ఎలాంటి గాయాలు కనిపించలేదు. అనుమానం వచ్చిన పోలీసులు... ఇంట్లో ఉన్న పిల్లలను ఏం జరిగిందని ప్రశ్నించారు. దానికి వాళ్లు తండ్రి, తల్లిపైకి దాడి చేయలేదని... మమ్మీయే, డాడిని కొట్టిందని చెప్పారు. దాంతో భర్తను ప్రశ్నించగా... అతను చెప్పిన విషయాలు విని జనాలు షాకయ్యారు. రాత్రి 12 గంటల సమయంలో ఫుల్లుగా తాగి వచ్చిన ఎరికా యోడర్... రాగానే భర్త దగ్గరికి వచ్చి సెక్స్ కావాలంటూ అడిగిందట. మద్యం మత్తులో ఉన్న ఎరికా యోడర్ వాలకం చూసి... అనుమానించిన అతను, అందుకు ఒప్పుకోలేదు. మూడు, రెండో తరగతి చదువుతున్న పిల్లల ముందు... భార్య ప్రవర్తన చూసి ఇది సమయం కాదని తోసేశాడు. దాంతో తీవ్ర ఆవేశానికి లోనైన ఎరికా... భర్తను చేతికి అందిన వస్తువు తీసుకుని చితక్కొట్టింది. ఆ తర్వాత మరోసారి తనతో శృంగారం చేయాలంటూ భర్తను ఫోర్స్ చేసింది. అయినా అతను వినలేదు. దాంతో పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తించిన ఆమె... పోలీసులకు ఫోన్ చేసి భర్తే తనపై దాడి చేశాడంటూ ఫిర్యాదు చేసింది.

ఆమె మాటలు, ప్రవర్తన వింతగా తోయడంతో సదరు మహిళ మద్యంతో పాటు డ్రగ్స్ కూడా తీసుకుని ఉంటుందని అనుమానించిన పోలీసులు... ఆమెను అదుపులోకి తీసుకున్నారు. భర్తపై దాడి చేయడమే కాకుండా తప్పుడు కేసు పెట్టేందుకు ప్రవర్తించడం, డ్రగ్స్ తీసుకోవడం వంటి కేసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.


First published: May 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>