వీళ్లేం పోలీసులు బాబోయ్.. మరీ ఇంత కక్కుర్తా.. కూతురు కనిపించడం లేదని మహిళ ఫిర్యాదు చేస్తే...

బాధిత మహిళ

సామాన్యులకు ఏదైనా కష్టం వస్తే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మొరపెట్టుకుంటారు. కానీ.. సమస్య పరిష్కరించాల్సిన పోలీసులే సాయం చేయడం మానేసి అలసిన బతుకులను అన్యాయంగా దోచుకుంటే.. ఆ వ్యవస్థ మీదే ప్రజలకు నమ్మకం పోయే ప్రమాదముంది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ ఘటన ఇలాంటి పోలీసులు కూడా ఉన్నారని రుజువు చేసింది. పూర్తి వివరాల్లోకెళితే.. గుడియా అనే ఓ దివ్యాంగురాలికి 15 ఏళ్ల వయసున్న...

 • Share this:
  కాన్పూర్: సామాన్యులకు ఏదైనా కష్టం వస్తే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మొరపెట్టుకుంటారు. కానీ.. సమస్య పరిష్కరించాల్సిన పోలీసులే సాయం చేయడం మానేసి అలసిన బతుకులను అన్యాయంగా దోచుకుంటే.. ఆ వ్యవస్థ మీదే ప్రజలకు నమ్మకం పోయే ప్రమాదముంది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ ఘటన ఇలాంటి పోలీసులు కూడా ఉన్నారని రుజువు చేసింది. పూర్తి వివరాల్లోకెళితే.. గుడియా అనే ఓ దివ్యాంగురాలికి 15 ఏళ్ల వయసున్న కుమార్తె ఉంది. ఆమె కూతురు నెల రోజులుగా కనిపించడం లేదు. తన కూతురు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేయడానికి ఆమె చాకేరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుపై ఎంతకీ స్పందన లేకపోవడంతో నిలదీసి అడిగిన ఆ మహిళకు చేదు అనుభవం ఎదురైంది.

  ‘నీ కూతురిని వెతికిపెట్టాలంటే మా పోలీసు వాహనాల్లో డీజిల్ కొట్టించు.. అప్పుడు చూద్దాం’ అని పోలీసుల నుంచి వచ్చిన సమాధానం విని ఆ మహిళ హతాశురాలయింది. ఆ మహిళ అప్పటికే కడు పేదరికంలో జీవనం సాగిస్తోంది. అలాంటి మహిళను డీజిల్‌కు డబ్బులడగడానికి నోరెలా వచ్చిందో తెలియదు గానీ కూతురిని వెతికిపెడతారనే ఆశతో అప్పోసొప్పో చేసి మరీ 15,000 రూపాయలకు డీజిల్ పోయించింది. పాపం.. అంత చేసినా ఆ కన్నతల్లికి నిరాశే ఎదురైంది. ఆ పోలీసు వాహనాల్లో సదరు పోలీసులు పిచ్చాపాటిగా ప్రయాణించారే తప్ప ఆమె కూతురిని వెతికిపెట్టలేదు. దీంతో.. ఆ తల్లికి ఏం చేయాలో అర్థం కాలేదు.

  ఇదేంటని ఆ పోలీస్ స్టేషన్‌లో ఎవరిని అడిగినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆమె కూతురిని వెతికిపెట్టకపోగా.. ఆమె డబ్బులిస్తే డీజిల్ కొట్టించుకుని జల్సాలు చేసిన ఆ పోలీసులు పదేపదే స్టేషన్‌కు ఎందుకొస్తున్నావంటూ ఆమెనే తిట్టిపోశారు. దీంతో.. ఆ కన్నతల్లి గుండె తల్లడిల్లింది. ఏం చేయాలో తెలియలేదు. తన కూతురు కనిపించలేదన్న బాధలో పోలీస్ స్టేషన్ ఎదుటే బోరున విలపించింది. ఆ తల్లి వేదనను మీడియా ప్రసారం చేసింది. దీంతో.. ఈ విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టిలో పడింది. ఈ ఘటనపై విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆమె కూతురుని తక్షణమే వెతికిపెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
  Published by:Sambasiva Reddy
  First published: