హోమ్ /వార్తలు /క్రైమ్ /

అమానుషం.. నడి రోడ్డుపై మహిళా న్యాయవాదిపై కొడవలితో దాడి..

అమానుషం.. నడి రోడ్డుపై మహిళా న్యాయవాదిపై కొడవలితో దాడి..

గాయపడిన  మహిళ న్యాయవాది

గాయపడిన మహిళ న్యాయవాది

Tamilnadu: మహిళా న్యాయవాది తన కూతురుతో కలిసి పాత కేసుల వివరాల నోట్ కోసం కార్యాలయానికి వచ్చింది. ఆ సమయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Tamil Nadu, India

తమిళనాడులో (Tamil nadu) పట్టపగలు షాకింగ్ ఘటన సంభవించింది. ఒక మహిళా న్యాయవాదిపై గుర్తుతెలియని దుండగులు దారుణానికి పాల్పడ్డారు. ఆమె పై కొడవలితో దాడి చేస్తూ, చంపడానికి ప్రయత్నించారు. ఘటన జరిగినప్పుడు ఆమె కూతురు కూడా అక్కడే ఉంది. ఆమెకూడా దీన్ని ప్రతిఘటించడానికి ప్రయత్నించడంతో ఆమెపై కూడా దాడిచేశారు. వీరి అరుపులు విని జనం.. ఒక్కసారిగా అక్కడికి రావడంతో దుండగులు పారిపోయారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో షాకింగ్ ఉదంతం జరిగింది. బాధితురాలు జమీలా బాను మహిళ న్యాయవాది. ఆమె కుమారన్ సలైలోని మనీలా కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేస్తుంది. ఈ క్రమంలో.. తన పాత కేసులకు సంబంధించిన నోట్ ల కోసం జమీలా బాను.. స్థానికంగా ఉన్న కార్యాలయానికి వచ్చింది. అప్పటికే అక్కడ ఉన్న దుండగులు మూకుమ్మడిగా కొడవలితో తెగబడ్డారు. వెంటనే ఆమె ప్రతిఘటించి, గట్టిగా అరవడంతో అక్కడున్న వారు కూడా వీరిని కాపాడే ప్రయత్నంచేశారు.

మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె కూతురు కూడా కత్తిపోటు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో దుండగులు అక్కడ కత్తిని వదిలేసి పారిపోయాడు. జమీలా తలకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులకు వారిని, ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్‌(UttarPradesh)లోని అగ్రా జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

ఓ యువకుడిని 10 రోజుల్లో 5 సార్లు పాము కాటేసింది(Snake Bitten 5 times). అయితే అన్నిసార్లూ ఒకే పాము,ఒకే చోట కాటేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఆగ్రా(Agra) జిల్లాలోని మన్‌కేఢా గ్రామానికి చెందిన రామ్ కుమార్ చాహర్ కుమారుడు రజత్ చాహర్(20) డిగ్రీ చదువుతున్నాడు. ఈనెల 6వ తేదీ సాయంత్రం రజత్ చాహర్ ఇంటి బయట వాకింగ్ చేస్తున్న సమయంలో అతడి ఎడమ కాలుపై ఓ పాము కాటేసి వెళ్లిపోయింది.

వెంటనే కుటుంబసభ్యులు చాహర్ ని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. 4 గంటలపాటు అతడి పరిస్థితిని పర్యవేక్షించిన అనంతరం పాము కాటు లక్షణాలేవీ కనిపించడం లేదని డాక్టర్లు రజత్​ ను ఇంటికి పంపేశారు. రెండు రోజుల తర్వాత సాయంత్రం పూట ఇంటి బయట ఉన్న బాత్రూమ్ ​కు వెళ్లిన రజత్ ఎడమ కాలిపై మరోసారు అదే పాము కాటేసింది. రజత్ ​ని హుటాహుటిన ముబారక్​పుర్​ తీసుకెళ్లి, నాటు వైద్యుల దగ్గర ట్రీట్మెంట్ చేయించారు.

అయినా ఆ పాము రజత్ ని విడిచి పెట్టలేదు. ఈ నెల 11న రజత్ తన ఇంట్లోని ఓ గదిలో ఉండగా అతడి ఎడమ కాలిపై మరోసారు అదే పాము కాటేసింది. వెంటనే అదే వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించారు కుటుంబసభ్యులు. మళ్లీ ఈ నెల 13న బాత్రూమ్​లో ఉండగా ఓసారి, 14న చెప్పులు వేసుకుంటుండగా మరోసారి రజత్​ ను పాము అదే పాము అదే ఎడమకాలిపై కరిచింది. అయితే సమయానికి ట్రీట్మెంట్ అందుతూ రజత్ ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ ఎప్పుడు ఏం జరుగుతోందనని అతడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. రజత్ చాహర్ విషయం గురించి తెలిసిన గ్రామస్థులు అతడి ఇంటికెళ్లి పరామర్శిస్తున్నారు. ఈ పాము రజత్ పై పగబట్టిన విషయం ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్ అయింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Tamil nadu

ఉత్తమ కథలు