ఎడమ కాలికి గాయమైతే కుడి కాలికి సర్జరీ...ప్రభుత్వాస్పత్రిలో దారుణం

వైద్యుల నిర్లక్ష్యంపై బాధితురాలి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. డాక్టర్ల గొడవ పెట్టుకున్నారు. అనంతరం ఆస్పత్రి ముందు బైఠాయించి ధర్నాకు దిగారు.

news18-telugu
Updated: February 10, 2019, 9:02 PM IST
ఎడమ కాలికి గాయమైతే కుడి కాలికి సర్జరీ...ప్రభుత్వాస్పత్రిలో దారుణం
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: February 10, 2019, 9:02 PM IST
వైద్యుల నిర్లక్ష్యం..! ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న వార్త..! వైద్యుల నిర్లక్ష్యానికి ఎంతో మంది రోగులు ఆస్పత్రుల్లో నరకం చూస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫీజుల దోపిడీ భరించలేక ప్రభుత్వ దవాఖానాలనే నమ్ముకునే పేదలకు...ఇలాంటి అనుభవాలు ఎప్పుడో ఓసారి ఎదురయ్యే ఉంటుంది. కొన్ని ఆస్పత్రుల్లో డాక్టర్లు ఉండరు..మరికొన్ని చోట్ల వైద్య పరికరాలు, మందువు ఉండవు. వైద్యులు పట్టించుకోకపోవడం..సరైన చికిత్స చేయకపోవడం వలన ఎంతో మంది చనిపోతున్నారు. మరెంతో మంది జీవచ్ఛవాలుగా మారుతున్నారు. ఇటీవల హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో రోగి కడుపులో డాక్టర్లు కత్తెర మరిచిపోయిన ఘటన మరవకముందే ఒడిశాలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఎడమకాలికి గాయమై ఓ మహిళ ఆస్పత్రికి వెళ్తే.. కుడికుడికాలికి ఆపరేషన్ చేశారు.

కియోంజర్ జిల్లా ఖాబిల్ గ్రామానికి చెందిన మితారాణి ఇటీవల ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. ఎడమకాలికి బలమైన గాయం కావడంతో ఆనంద్‌పూర్‌లో ఉన్న ప్రభుత్వాస్పత్రికి చికిత్స కోసం వెళ్లింది. పలు పరీక్షలు చేసిన అనంతరం ఆమెకు సర్జరీ చేయాలని సూచించారు డాక్టర్లు. వెంటనే ఆపరేషన్ థియేటర్‌లోనికి తీసుకెళ్లి ఆపరేషన్ చేశారు. సర్జరీ విజయవంతమైందని రెండు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తామని మితారాణి బంధువులకు తెలిపారు. అంతా ఓకే అనుకున్న సమయంలో.. బాధితురాలు స్పృహలోకి వచ్చి కళ్లుతెరిచి చూసి షాక్‌కు గురయింది. తనకు ఎడమ కాలికి దెబ్బతగిలితే..కుడి కాలికి ఆపరేషన్ చేశారని వాపోయింది. కుడికాలికి సర్జరీ చేయడంతో నొప్పితో విలవిల్లాడిపోయింది.
గాయం తీవ్రమైందని సర్జరీ చేయాలని డాక్టర్లు చెప్పారు. ఆ తర్వాత అనస్థీషియా ఇవ్వడానికి డ్రెస్సింగ్ రూమ్‌లోకి తీసుకెళ్లారు. ఈ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. స్పృహలోకి వచ్చి చూసేసరికి నా కుడికాలికి కట్టుకట్టి ఉంది. ఎడమ కాలికి గాయమైతే కుడికాలికి సర్జరీ చేశారు. ప్రస్తుతం నేను నడవలేని పరిస్థితలో ఉన్నాను.
మితారాణి, బాధితురాలు
వైద్యుల నిర్లక్ష్యంపై బాధితురాలి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. డాక్టర్ల గొడవ పెట్టుకున్నారు. అనంతరం ఆస్పత్రి ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్ అన్నారు. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు నోటీసులు పంపారు.
First published: February 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...