Home /News /crime /

WOMAN ACCUSES EX COLLEAGUE OF MOLESTED IN HOTEL IN GURGAON PAH

యూకే నుంచి సహోద్యోగి వచ్చాడని హోటల్ కు వెళ్లిన యువతి.. ఆ తర్వాత.. ఏంజరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Haryana: కొన్నేళ్లపాటు ఇద్దరు ఒకే కంపెనీలో పనిచేశారు. ఆతర్వాత.. అతగాడు ఒకచోట, ఈమె మరో చోట ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలో.. ఆమెను కలుద్దామని చెప్పి మెసెజ్ చేశాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Haryana, India
కొందరు స్నేహం పేరుతో అమ్మాయిలను బుట్టలో వేసుకుంటారు. ప్రేమిస్తున్నామని మాయమాటలు చెబుతున్నారు. అంతే కాకుండా.. స్నేహం ముసుగులో అడ్డమైన తిరుగుళ్లు తిరుగుతుంటారు. మరికొందరు ఒకరికి తెలియకుండా మరికొందరితో ఎఫైర్ లను నడిపిస్తుంటారు. ఇంకొందరు.. తమ అవసరాలకోసం ప్రేమను పావుగా వాడుకుంటారు. తమ అవసరాలు తీరే వరకు అడ్డమైన తిరుగుళ్లు తిరుగుతారు. ఆ తర్వాత.. అసలు రంగును బయటపెడుతుంటారు. మరికొందరు పార్టీలకని, పబ్ లకు మహిళలను తీసుకెళ్తుంటారు. అక్కడ కూల్ డ్రింక్ లో, మత్తుపదార్థాలు కలిపి తాగిస్తారు. మత్తులోకి జారుకోగానే అత్యాచారాలకు తెగబడుతుంటారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. హర్యానాలోని (Haryana)  గుర్గావ్ లో దారుణ ఘటన సంభవించింది. గుర్గావ్ లో ఉన్న హోటల్ లో.. యూకే కు చెందిన ఒక వ్యక్తి వచ్చాడు. అతను.. గతంలో.. యూకే ఆధారిత కంపెనీలో.. మరో మహిళతో ఆరేళ్లుగా కలిసి పనిచేశారు. దీంతో కలుద్దామని చెప్పాడు. అతని మాటలు నమ్మిన అమ్మాయి, హోటల్ కు వెళ్లింది. అక్కడ బార్ లో ఇద్దరు కలిసి ఫుల్ గా తాగారు. అమ్మాయి వద్దని చెప్పిన.. బలవంతంగా తాగించాడు. బీర్ లో మత్తు మాత్రలు కలిపి ఆమెతో తాగించాడు.ఈ క్రమంలో.. ఆమె ఉదయాన్నే లేచీచూసుకునే సరికి ఒంటిమీద బట్టలు సరిగా లేదు. దీంతో తనపై దారుణం జరిగిందని విషయం ఆలస్యంగా తెలుసుకుంది. మత్తులో పడిపోయినప్పుడు అతగాడు.. అత్యాచారం చేసినట్లు తెలిసి కన్నీళ్లుపెట్టుకుంది. దీంతో షాకింగ్ నకు గురైంది. కొన్నిరోజుల పాటు విషయాన్ని ఎవరికి చెప్పలేదు. అయితే.. తాజాగా, మహిళ తన బాధను ఇంట్లో వారికి చెప్పుకుంది. ఆమెకు ధైర్యం చెప్పి పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు. ఈ మేరకే కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటి వరకు నిందితులను ఎవరిని అరెస్టు చేయలేదని అన్నారు.

ఇదిలా ఉండగా తన కోడలి తలను అత్తనరికి ఏకంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లింది.

వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని అన్నమయ్య జిల్లా (Annamayya District) రాయచోటి మండలంలో నివాసం ఉంటుంది సుబమ్మ. ఈమె కోడలు వసుంధరతో కలసి కొత్తపేట రామాపురంలో ఉంటోంది. కొడుకు ఉన్నంత కాలం కోడలితో అత్త బాగానే మెలిగేది. కొన్ని తగాదాలు కొని తెచ్చుకున్న కొడుకు కొన్నేళ్లక్రిందట శ్రీకాళహస్తి పట్టణంలో హత్యకు గురైయ్యాడు. దీంతో అత్తాకోడళ్లిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. భర్త పోయిన నాటి నుంచి అత్తాకోడళ్ల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు జరుగుతున్నాయి.

మరోవైపు యుక్తవయసులో ఉండటం.. భర్త లేకపోవడంతో కోడలు వసుంధర మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న అత్త తరచూ కోడలితో గొడవకు దిగేది. కుటుంబానికి చెందిన కొంతపొలంతో పాటు ఇల్లు, ఇతర ఆస్తులు అత్త సుబ్బమ్మ పేరిట ఉన్నాయి. దీంతో ఆస్తిలో తనకు వాటా కావాలని అత్తతో గొడవపడుతుండేది వసుంధర.

ఈ క్రమంలో ఇవాళ ఉదయం నుంచి గొడవ తారాస్థాయికి చేరుకుంది. దీంతో సుబ్బమ్మ తన అన్న కొడుకుతో మాట్లాడుతుండగా.. కోడలు వసుంధర తన ప్రియుడిని, మరిదిని వెంటబెట్టుకొని వచ్చింది. అక్కడితో ఆగకుండా అత్తతో గొడవకు దిగింది. ఇద్దరూ కాసేపు జుట్టుజుట్టు పట్టుకొని గొడవపడ్డారు. అదే సమయంలో కోడలు వసుంధర ఎక్కడ చంపేస్తుందో అని భయపడిన సుబ్బమ్మ.. తన అన్న కొడుకుతో కలసి కత్తితో కోడలి తల నరికేసింది. అంతేకాదు మొండెం నుంచి తలను వేరు చేసి తలను తీసుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. ధైర్యంగా రోడ్డుపై వెళ్తున్న ఆమెను చూసి స్థానికులు హడలిపోయారు. సుబ్బమ్మను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Haryana

తదుపరి వార్తలు