WIVES WILL BE AVAILABLE ON RENT BASIS IN SOME VILLAGES OF MADHYA PRADESH AND GUJARAT AK
Wife On Rent: అద్దెకు లభించే భార్య.. కాపురం కూడా చేసుకోవచ్చు.. ఎక్కడంటే..
ప్రతీకాత్మక చిత్రం
ఇలా మరొకరి భార్యను అద్దెకు తీసుకుని వెళ్లే వాళ్లు కొన్న రూల్స్ కూడా పాటించాల్సి ఉంటుంది. వేరే వారి భార్యను కొంతకాలం పాటు తాము అద్దెకు తీసుకుంటున్నట్టుగా స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ రాసి ఇవ్వాల్సి ఉంటుంది.
ఒకరి భార్యను మరొకరు వేరే దృష్టితో చూసినా.. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసే చట్టాలు మన దేశంలో ఉన్నాయి. అయితే అలాంటి మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వింత వింత సంప్రదాయలు, ఆచారాలు కూడా ఉన్నాయి. కొన్ని దశాబ్దాల ముందు నుంచి వాటిని అక్కడి వాళ్లు పాటిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఓ జిల్లాలో కనిపించే ఇలాంటి ఓ ఆచారం గురించి తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఇది మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో ఉంది. అక్కడ పాటించే ఈ ఆచారం పేరు ధడిచా ప్రాథ అని అంటారు. ఇక్కడ ధనవంతులు, జీవిత భాగస్వామి దొరకని కొన్ని అగ్రవర్ణాల వాళ్లు వేరేవాళ్ల భార్యను అద్దెకు తీసుకుంటుంటారు. వినడానికి ఇది వింతగా ఉన్నా.. ఇది నిజం. ఇక్కడ ఈ పద్ధతి ఇంకా కొనసాగుతోంది. ఒక నెల లేదా ఒక సంవత్సరం వరకు ఇలా వేరే వారి భార్యను అద్దెకు తీసుకుని వెళుతుంటారు.
అయితే ఇలా మరొకరి భార్యను అద్దెకు తీసుకుని వెళ్లే వాళ్లు కొన్న రూల్స్ కూడా పాటించాల్సి ఉంటుంది. వేరే వారి భార్యను కొంతకాలం పాటు తాము అద్దెకు తీసుకుంటున్నట్టుగా స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ రాసి ఇవ్వాల్సి ఉంటుంది. రూ. 10 నుంచి రూ. 100 విలువైన స్టాంప్ పేపర్ మీద సంతకాలు చేసి మరి వేరే వ్యక్తి భార్యను అద్దెకు తీసుకుని వెళుతుంటారు ఇక్కడికి వచ్చే బడాబాబులు. ఇలా చేసుకున్న ఒప్పందం ముగిసే వరకు ఆ మహిళ మరో వ్యక్తితో జీవించాల్సి ఉంటుంది. అతడితో పడక సుఖం కూడా పంచుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు అతడి కుటుంబం మొత్తాన్ని చూసుకోవాలి.
మధ్యప్రదేశ్‌లోనే కాకుండా గుజరాత్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గుజరాత్‌కు చెందిన అట్టా ప్రజాపతి అనే వ్యవసాయ కూలీ శిశుహత్య తర్వాత మహిళల కొరత కారణంగా తన భార్య లక్ష్మిని సంపన్న యజమానికి నెల రోజుల పాటు లీజుకు ఇచ్చాడు. ఈ బదిలీ ద్వారా అతను తన నెలవారీ జీతం కంటే 10 రెట్లు ఎక్కువ సంపాదన పొందుతున్నాడు. గుజరాత్-మధ్యప్రదేశ్ ప్రాంతంలోని చాలా మంది గ్రామస్తులకు ఇది లాభదాయకమైన వ్యాపారం. కొన్ని సందర్భాల్లో మహిళలను రూ.500 కంటే తక్కువకు విక్రయిస్తుండగా, కొన్ని కుటుంబాల్లో వారి కుమార్తెలను కొన్ని సంఘాల్లోని పురుషులకు రూ.50,000కు అప్పగిస్తున్నారు.
ఇలాంటి వ్యాపారాలను ప్రోత్సహించే మధ్యవర్తులు కూడా ఉన్నారు. కుటుంబ పేదరికం నుంచి బయటపడేందుకు మహిళలు ఇలాంటి చర్యలకు గురవుతున్నారు. ముఖ్యంగా గిరిజన కుటుంబాలు ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. వీటి గురించి పోలీసులకు పలు సందర్భాల్లో ఫిర్యాదులు వస్తుండగా.. చాలా కేసుల్లో ఫిర్యాదు చేయడానికి కూడా ఎవరూ ముందుకు రారని తెలుస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.