చెన్నై: తమిళనాడు రాజధాని నగరం చెన్నైలోని భట్టాపురం డ్రైవర్స్ కాలనీలో పెళ్లయిన మూడు నెలలకే భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన బాధిత కుటుంబంలో విషాదం నింపింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని వాటర్ బోర్డ్ కార్యాలయంలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్న అఖిలన్ అనే యువకుడికి మూడు నెలల క్రితం అన్నా నగర్‌కు చెందిన రోనీషా అనే 22 ఏళ్ల యువతితో వివాహం జరిగింది. రోనీషా M.Com చదువుతోంది.
పెళ్లి తర్వాత కూడా ఆమెను చదివించేందుకు వరుడి కుటుంబం ముందుకు రావడంతో ఆమె సంతోషంగా పెళ్లి చేసుకుంది. వీళ్లిద్దరికీ పెళ్లి జరిగి మూడు నెలలయింది. రోనీషా మామయ్య ట్యాక్స్ ఆఫీస్‌లో పనిచేసి రిటైర్ అయ్యారు. అత్తయ్య మీనా చెన్నై స్టూడియోలో టైపిస్ట్‌గా పనిచేస్తోంది. ఇదిలా ఉండగా.. రోనీషా మామయ్య నిన్న ఉదయం ఓ పని మీద అరక్కోణం వెళ్లాడు. రోనీషా భర్త, అత్త ఎవరి ఉద్యోగాలకు వాళ్లు వెళ్లిపోయారు. ఇంట్లో రోనీషా ఒక్కతే ఉంది. ఇంట్లో వాళ్లు తిరిగొచ్చేసరికి రోనీషా బెడ్రూంలోని ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. ఈ పరిణామం ఇంట్లో వాళ్లందరినీ షాక్‌కు గురిచేసింది.
పోలీసులు ఈ ఘటనకు సంబంధించి సమాచారం తెలిసి స్పాట్‌కు చేరుకున్నారు. రోనీషా మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాలేజ్‌కు వెళుతుండే రోనీషా ఎందుకిలాంటి నిర్ణయం తీసుకుందనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. రోజూ కాలేజీకి వెళుతుండే రోనీషా పెళ్లయిన మూడు నెలలకే ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో స్థానికంగా కలకలం రేగింది.
ఇది కూడా చదవండి: OMG: 50 ఏళ్ల వయసులో కూడా ఇంత కామ కోరికలా.. ఆమెనూ, నిన్నూ ఏం చేయాలి అసలు..
తిరువళ్లూరు ఆర్డీవో కూడా ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఇంట్లో భర్తతో ఏమైనా గొడవలా, అదనపు కట్నం కోసం వేధింపుల వల్లనా లేక కాలేజ్‌లో ఏదైనా సమస్య వల్ల రోనీషా ఆత్మహత్య చేసుకుందా.. ఇలా అన్ని కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఏ సమస్యకైనా ఆత్మహత్య పరిష్కారం కాదని, మాట్లాడి చర్చించుకోవాలని.. ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు ఎవరూ తీసుకోవద్దని పోలీసులు సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chennai, Crime news, Newly Couple, Suicide