పెళ్లయిన తర్వాత రోజే పెళ్లికొడుకు మర్మాంగాలు కోసేసి...

పశ్చిమబెంగాల్లో దారుణం జరిగింది. ఓ యువకుడి మర్మాంగాలను కోసేశారు కొందరు దుండగులు.

news18-telugu
Updated: January 28, 2020, 5:33 AM IST
పెళ్లయిన తర్వాత రోజే పెళ్లికొడుకు మర్మాంగాలు కోసేసి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పశ్చిమబెంగాల్లో దారుణం జరిగింది. ఓ యువకుడి మర్మాంగాలను కోసేశారు కొందరు దుండగులు. పశ్చిమబెంగాల్లోని సైద్‌పూర్‌కు చెందిన నూర్ ఆలం తన ప్రియురాలిని పెళ్లిచేసుకున్నాడు. ఆ పెళ్లికి అతడి కుటుంబంలోని ఎవరూ అంగీకరించలేదు. అయినా, తన ఇంట్లో పెద్దలను ఎదిరించి ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే, పెళ్లయిన రోజు రాత్రి అత్తమామల ఇంట్లోనే గడిపాడు. అనంతరం తర్వాత రోజు రాత్రి అత్తగారింట్లో భోజనం చేసి తన ఇంటికి వెళ్తున్నానని భార్యతో చెప్పి బయలుదేరాడు. కానీ, అతడు ఇంటికి చేరుకోలేదు. కానీ, అర్ధరాత్రి సమయంలో రోడ్డు పక్కన తుప్పల్లో నుంచి బాధతో ఎవరో మూలుగుతున్న శబ్దాలను అటుగా వెళ్తున్న వారు గమనించి చూస్తే నూర్ ఆలం అక్కడ రక్తపు మడుగులో పడిపోయి ఉన్నాడు. అతడి కాలు మీద ఎవరో కత్తితో దాడి చేశారు. దీంతోపాటు అతడి మర్మాంగాన్ని కూడా కట్ చేశారు. ఇంట్లో ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు కోపంతో అతడి కుటుంబసభ్యులే ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దారిదోపిడీకి ప్రయత్నించిన దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టి ఉండొచ్చని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. అయితే, పెళ్లి చేసుకుని ఇంకా 24 గంటలు కూడా గడవని సమయంలో అతడి మర్మాంగాలను కోసేశారన్న వార్త దావానలంలా వ్యాపించింది.

First published: January 27, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు