భర్త ఆత్మహత్య... ఆ వార్త విని కూతురితో కలిసి ఉరివేసుకున్న భార్య

మరిదితో కలిసి ఆస్పత్రికి వెళ్లి భర్త మృతదేహం చూసింది. ఆ తర్వాత రాత్రి ఇంటికి వచ్చిన ఆమె.. కూతుర్ని ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసి... ఆ తర్వాత ఆమె కూడా ఉరివేసుకొని ప్రాణం తీసుకుంది.

news18-telugu
Updated: December 14, 2019, 11:26 AM IST
భర్త ఆత్మహత్య... ఆ వార్త విని కూతురితో కలిసి ఉరివేసుకున్న భార్య
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మరణ వార్త విన్న భార్య తట్టుకోలేకపోయింది.భర్త లేని బతుకు తనకు వద్దు అంటూ ఐదేళ్ల కూతురు సహా తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన యూపీ నోయిడాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నోయిడాలోని సెక్టార్ 128లో భరత్ అనే వ్యక్తి తన కుటుంబంతో నివసిస్తున్నాడు. అతనికి భార్య శివరంజని, ఐదేళ్ల కూతురు జయశ్రీత ఉన్నారు. భరత్ పదేళ్ల కిందట శివరంజనిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.భరత్ శుక్రవారం ఉదయం ఢిల్లీలోని జవరహార్ లాల్ నెహ్రూ మెట్రో స్టేషన్ వద్ద... మెట్రో రైలు ఎదుట దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషయం తెలుసుకున్న భార్య.. భర్త మరణంతో తల్లడిల్లిపోయింది. మరిదితో కలిసి ఆస్పత్రికి వెళ్లి భర్త మృతదేహం చూసింది. ఆ తర్వాత రాత్రి ఇంటికి వచ్చిన ఆమె.. కూతుర్ని ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసి... ఆ తర్వాత ఆమె కూడా ఉరివేసుకొని ప్రాణం తీసుకుంది. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తల్లికూతుళ్ల మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తలరించారు. అయితే వీరి సూసైడ్ వెనుక కారణాలు ఏంటో తెలియలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

First published: December 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>