ఈస్టర్ రోజున దారుణ మారణహోమాన్ని చూసిన శ్రీలంక ఇంకా కోలుకోలేకపోతోంది. వందలాది మంది ప్రాణాలను బలి తీసుకున్న ఆ పేలుళ్ల ఘటనలు ఇంకా కళ్ల ముందే కదలాడుతున్నాయి. మృతుల కుటుంబీకులను ఓదార్చడం ఎవ్వరి వల్ల కావడం లేదు. మరోవైపు, పేలుళ్ల వెనక ఏ ఉగ్రవాద సంస్థ హస్తం ఉందన్న విషయంపై ఆ దేశ ప్రభుత్వం దర్యాప్తు ముమ్మరం చేసింది. ఓ మసాలా వ్యాపారి కుమారులే ఈ దారుణానికి ఒడిగట్టారని చెబుతున్న శ్రీలంక ప్రభుత్వం అంతర్జాతీయ సహకారం కోసం ఎదురు చూస్తోంది.
ఇప్పటి వరకు 75 మంది అనుమానితులను అరెస్టు చేశామని, అందులో తొమ్మిది మంది పాక్ జాతీయులు ఉన్నారని ఆ దేశ ప్రధాని రనిల్ విక్రమసింఘే తెలిపారు. లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థ శ్రీలంక ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు ప్రేరేపిస్తోందని భారత నిఘా సంస్థలు చెప్పాయని, ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు అంతర్జాతీయ సమాజంతో కలిసి ముందడుగు వేస్తామని వెల్లడించారు. వీలైతే పాక్ సహాయం తీసుకొని ఉగ్రవాదులను తుదముట్టిస్తామని వివరించారు. ఇప్పటికైతే ఆ దేశం తమకు అన్ని విధాలుగా సహకరిస్తోందని తెలిపారు. అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని శ్రీలంక తొలిసారి ఎదుర్కొందని, దాన్నుంచి గుణపాఠం నేర్చుకొని జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇది కూడా చూడండి :-
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India, ISIS, Sri Lanka, Sri Lanka Blasts, Terror attack, Terrorism