• Home
 • »
 • News
 • »
 • crime
 • »
 • WIFES LOVE WITH NEIGHBOR THE HUSBAND CUT OFF HIS WIFES HEAD WITH A KNIFE AND HANDED HER OVER TO THE POLICE NK

Extramarital Affair: పక్కింటోడితో భార్య ఎఫైర్... భర్త ఏం చేశాడంటే...

భర్త చేతిలో ప్రాణం కోల్పోయిన భార్య

Extramarital Affair: వివాహేతర సంబంధాలు ఎప్పుడూ విషాదాంతాలే. అసలా కుటుంబంలో ఈ చిచ్చు ఎలా రేగింది? భార్యపై కోపంతో ఆ భర్త ఏం చేశాడు?

 • Share this:
  Extramarital Affair: అది పశ్చిమబెంగాల్‌లోని హస్నాబాద్. అర్థరాత్రి సమయం. అక్కడి పోలీస్ స్టేషన్‌లో రాత్రి వేళ ఇద్దరు కానిస్టేబుళ్లు డ్యూటీ చేస్తున్నారు. అక్కడకు ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్లాడు. అప్పుడప్పుడే నిద్రలోకి జారుకుంటున్న ఆ పోలీసులు... "ఎవరు... ఏమైంది... చోరీ జరిగిందా?" అని వరుస పశ్నలు వేశారు. తల అడ్డంగా ఊపిన అతను... నా పేరు సాధన్ మండల్. నేను నా భార్యను చంపేశాను అన్నాడు. పోలీసులకు నిద్ర మత్తు వదిలేసింది. "చంపేశావా... ఎందుకు?" అని అడిగారు. "అంత కంటే పెద్ద శిక్ష లేదుగా సార్... అందుకే అదే వేశాను" అన్నాడు. "శిక్ష వేశావా... ఏం మాట్లాడుతున్నావ్?... అసలేం జరిగింది?" అని అడిగితే... "నా చేతులతో నేనే నా భార్య తలను కత్తితో నరికేశాను" అన్నాడు. "ఏదో ఘనకార్యం చేసినట్లు చెబుతున్నావ్... అసలు చంపాల్సిన అవసరం ఏమొచ్చింది" అని అడిగితే... అతని కళ్లు ఎర్రబారాయి... రక్తం ఉప్పెనలా ఎగసిపడింది. ఆవేశం తన్నుకొచ్చింది... పగతో రగిలిపోయినట్లు ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత కాస్త నెమ్మదించి ఏం జరిగిందో చెప్పాడు.

  "నా పేరు సాధన్ మండల్. నా భార్య పేరు దీపాలీ మండల్. వయసు 38 ఏళ్లు. మాది కూరగాయల వ్యాపారం. బరున్హట్‌లో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాం. ఆ పక్క ఇంట్లోకి ఓ కుర్రాడు అద్దెకు దిగాడు. చూడ్డానికి చాలా అందంగా ఉంటాడు. వాడితో ఎప్పుడు లింక్ పెట్టుకుందో నాకు తెలియదు. ఓ రోజు చుట్టుపక్కల వాళ్లు నా కూరగాయల షాపుకి వచ్చి నాకు చెప్పారు. నీ భార్య పక్కింటి కుర్రాడి ఇంటికి వెళ్లడం చూశాం అన్నారు. ఆ రోజు ఇంటికొచ్చి ఎందుకెళ్లావని అడిగాను. ఏదో వస్తువు కావాలని అడిగేందుకు వెళ్లానంది. కానీ... అలా చాలాసార్లు వెళ్తోందని ఆ తర్వాత నాకు అర్థమైంది. ఓ రోజు మందలించాను. సైలెంట్‌గా ఉండిపోయింది. ఇక వెళ్లదులే అనుకున్నాను. వాడు రావడం మొదలుపెట్టాడు. నేను లేనప్పుడు ఈ యవ్వారం సాగుతోందని అర్థమైంది."

  హత్య జరిగిన రాత్రి: సాయంత్రం నేను ఇంటికొచ్చాను. నా భార్య ఇంట్లో కనిపించలేదు. ఫోన్ చేస్తే... స్విచ్ఛాఫ్ వచ్చింది. చుట్టుపక్కల వాళ్లను అడిగాను. ఎవరూ చూడలేదన్నారు. పక్కింటోడి తలుపు తాళం వేసి ఉంది. రాత్రి అయ్యాక ఇంటికొచ్చింది. ఎక్కడికెళ్లావని ప్రశ్నిస్తే... నీళ్లు నమిలింది. ఇద్దరి మధ్యా పెద్ద గొడవైంది. వాణ్ని వదలను ఏం చేస్తావని రెచ్చిపోయింది. నాకు పిచ్చి కోపం వచ్చింది. కూరగాయలు కోసే కత్తితో... మెడపై ఒక్కటిచ్చాను. అంతే... గిలగిలా కొట్టుకుంటూ... నేలపై పడి చచ్చింది" అని మొత్తం విషయం చెప్పాడు సాధన్.

  పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. డెడ్ బాడీని రికవరీ చేసుకొని... బసిర్హత్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌కి పోస్ట్ మార్టం కోసం పంపారు. ఇలా ఓ వివాహేతర సంబంధం ఆ ఫ్యామిలీలో చిచ్చుపెట్టింది. ఆమె ప్రాణాలు పోగా... అతను జైలుపాలయ్యాడు. అసలా ఎఫైరే లేకపోయి ఉంటే... వాళ్ల కాపురం వాళ్లు చేసుకొని... వాళ్ల జీవితం వాళ్లు జీవించేవాళ్లు. వివాహేతర సంబంధాలు తప్పు కాదన్న సుప్రీంకోర్టు... సామాజిక కట్టుబాట్లను పాటించడం మేలని చెప్పింది. కానీ... సుప్రీంకోర్టు చెప్పిన మొదటి మాటనే చాలా మంది ఫాలో అవుతున్నారు. ఫలితంగా ఇలాంటి విషాదాలు జరుగుతున్నాయి.
  Published by:Krishna Kumar N
  First published: