#LoveSexDhokha: ఆ హత్యకు వివాహేతర సంబంధమే కారణమా?

హత్యకు గల అసలు కారణాల కోసం లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు. పోలీసులు నమ్మలేని విషయాలెన్నో బయటపడ్డాయి. విజయ్‌కు పెళ్లై ఆరు నెలలు కూడా దాటలేదు. అంతలోనే చనిపోయాడు. అయితే అతని భార్య రాజనందినిలో బాధ ఏమంత కనిపించలేదు. ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త చనిపోయాడన్న బాధ ఏమాత్రం లేకుండా సాధారణ జీవితం గడుపుతూనే ఉంది. ఆకాశ్, విపిన్‌లను విచారించినప్పుడు వాళ్లు కూడా రాజనందినిపై అనుమానం వ్యక్తం చేశారు.

news18-telugu
Updated: January 30, 2019, 11:53 PM IST
#LoveSexDhokha: ఆ హత్యకు వివాహేతర సంబంధమే కారణమా?
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: January 30, 2019, 11:53 PM IST
అతని పేరు విజయ్... పశ్చిమబెంగాల్‌లోని బర్న్‌పూర్‌వాసి. చనిపోవడానికి ముందు తన జీవితంలో ఇలాంటి ఘటనలు ఎదురవుతాయని తను ఊహించి ఉండడు. విజయ్ ఓరోజు గంగాజలాన్ని తీసుకొని బీహార్‌లోని సుల్తాన్‌గంజ్‌లో గంగా దర్శనానికి బయల్దేరాడు. ఓవైపు భక్తి... మరోవైపు ఉత్సాహం... కొండల మధ్యలో ఉన్న అడవిలో... చిన్న దారిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అంతే... ఎవరో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. కత్తులతో దాడి చేశారు. కిరాతకంగా చంపేశారు.

జూలై 27... హత్య జరిగిన రోజు. అసలు తనను ఎందుకు చంపుతన్నారో కూడా విజయ్‌కి అర్థం కాలేదేమో. దోపిడీ దొంగలా... నరహంతకులా? డబ్బుకోసం దాడి చేసి చంపేశారా? విజయ్‌కి ఇదేమీ తెలియదు. రక్తపుమడుగులో కుప్పకూలిపోయాడు. క్షణాల్లో ప్రాణాలొదిలాడు. అతను తీసుకెళ్తున్న గంగాజలం చెల్లాచెదురైపోయింది. అడవిలో మృతదేహం ఉందన్న సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు... మృతుడు ఎవరో కనిపెట్టారు. విచారణ మొదలుపెట్టారు. బంధువులైన ఆకాష్, విపిన్‌తో విజయ్‌కు గొడవలున్నట్టు తెలిసింది. వాళ్లను అరెస్ట్ చేసి విచారణ జరిపారు. జైలుకు పంపారు. కానీ అంతటితోనే విచారణ ఆగలేదు. హత్యకు గల అసలు కారణాల కోసం లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు. పోలీసులు నమ్మలేని విషయాలెన్నో బయటపడ్డాయి.

#LoveSexDhokha: ఆ హత్యకు వివాహేతర సంబంధమే కారణమా?, Wife’s affairs were the reasons behind killing of Vijay

విజయ్‌కు పెళ్లై ఆరు నెలలు కూడా దాటలేదు. అంతలోనే చనిపోయాడు. అయితే అతని భార్య రాజనందినిలో బాధ ఏమంత కనిపించలేదు. ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త చనిపోయాడన్న బాధ ఏమాత్రం లేకుండా సాధారణ జీవితం గడుపుతూనే ఉంది. ఆకాశ్, విపిన్‌లను విచారించినప్పుడు వాళ్లు కూడా రాజనందినిపై అనుమానం వ్యక్తం చేశారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 10... విజయ్‌కు రాజనందినితో పెళ్లైన రోజు. కానీ రాజనందిని సంతోషంగా లేదు. కారణం... ఇష్టం లేని పెళ్లి చేసుకోవడమే. ఆమెకో ప్రేమకథ ఉంది. ఆమె ప్రియుడి పేరు గుల్షన్. రాజనందిని సోదరుడు అరుణ్‌ స్నేహితుడే గుల్షన్. అరుణ్ కోసం తరచూ వాళ్ల ఇంటికి వెళ్లేవాడు. అక్కడ రాజనందిని చూసి ప్రేమలో పడ్డాడు. అతనంటే ఆమెకు కూడా ఇష్టం కావడంతో ప్రేమ చిగురించింది. కానీ ఇద్దరు కులమతాలు వేరు కావడం పెళ్లికి అడ్డంకిగా మారింది. రాజనందిని పెళ్లికి తల్లిదండ్రులు ఏర్పాట్లు చేస్తూ ఉండటంతో గుల్షన్‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. కానీ ఆమె కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. తల్లిదండ్రుల ఒత్తిడితో చివరకు విజయ్‌ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.

ఇష్టంలేని పెళ్లి చేసుకున్న రాజనందిని భర్తతో సరిగ్గా ఉండేదికాదు. గుల్షన్‌కు కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు. పెళ్లి తర్వాత కూడా ఇద్దరూ టచ్‌లోనే ఉన్నారు. గుల్షన్ సాయంతో విజయ్‌ని అంతమొందించాలని రాజనందిని ప్లాన్ చేసింది. తాను జూలైలో కన్వాడ్ యాత్రకు వెళ్తానని భార్యతో చెప్పాడు విజయ్. భర్త అడ్డు తొలగించడానికి ఇదే మంచి సమయం అనుకుంది రాజనందిని. యాత్రకు వెళ్తే తనకు ఫోన్‌లో టచ్‌లో ఉండాలని చెప్పింది భార్య.


#LoveSexDhokha: ఆ హత్యకు వివాహేతర సంబంధమే కారణమా?, Wife’s affairs were the reasons behind killing of Vijay
Loading...
జూలై 27న రాజనందిని విజయ్‌కు వరుసగా కాల్స్ చేసి మాట్లాడింది. అతను ఎక్కడ ఉన్నాడో ఆ సమాచారాన్ని గుల్షన్‌కు చేరవేసింది. విజయ్ నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లగానే గుల్షన్ తన స్నేహితుడు మనీష్ సాయంతో దాడి చేసి చంపేశాడు. పోలీసులు రాజనందిని కాల్ లిస్ట్ విశ్లేషిస్తే గుల్షన్‌తో మాట్లాడిన విషయం బయటపడింది. వాళ్లిద్దరి మధ్య సంబంధం ఏంటా అని ఆరా తీస్తే వివాహేతర సంబంధం గుట్టురట్టైంది.

విజయ్‌కు మాత్రం తన భార్యకు ఉన్న వివాహేతర సంబంధం గురించి తెలియదు. అసలు తనను చంపడానికి ప్లాన్ చేశారన్న విషయం కూడా తెలియదు. అడవిలో దాడి జరిగింది. ప్రాణాలు పోయాయి. భార్య వివాహేతర సంబంధం ఏ పాపం తెలియని విజయ్ ప్రాణాలు తీసింది.

ఇవి కూడా చదవండి:

లవ్... సెక్స్... దోఖా: భార్యతో శృంగారానికి భర్త ఎందుకు ఇష్టపడలేదు?

లవ్... సెక్స్... దోఖా: వివాహేతర సంబంధం ఎలా బయటపడింది?

 
First published: January 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...