హోమ్ /వార్తలు /క్రైమ్ /

Murder : ప్రియుడితో కలిసి భర్తను చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన భార్య

Murder : ప్రియుడితో కలిసి భర్తను చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన భార్య

నిందితులు భారతి-ఫ్రవీణ్

నిందితులు భారతి-ఫ్రవీణ్

Wife Killes Husband : వివాహేతర సంబంధం(Extramarital Affair) బయటపడటంతో ప్రియుడి(Lover)తో కలిసి కట్టుకున్న భర్తనే కడతేర్చిందో భార్య. తనపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఆ చావును బైక్ ప్రమాదంగా(Bike Accident) చిత్రీకరించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Wife Killes Husband : వివాహేతర సంబంధం(Extramarital Affair) బయటపడటంతో ప్రియుడి(Lover)తో కలిసి కట్టుకున్న భర్తనే కడతేర్చిందో భార్య. తనపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఆ చావును బైక్ ప్రమాదంగా(Bike Accident) చిత్రీకరించింది. చివరకు అసలు విషయం బయటపడి ఊచలు లెక్కపెడుతోంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన వివరాలను యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో డీసీపీ నారాయణరెడ్డి మంగళవారం వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... జనగామ జిల్లా హన్మంతపూర్‌ తేటకుంటతండాకు చెందిన లకావత్‌ కొమురెళ్లి(32)-భారతి భార్యాభర్తలు. వీరికి ఆరేళ్ల క్రితం వివాహమవగా ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరు సికింద్రాబ్ లోని నామాలగుండు సీతాఫల్ మండిలో నివాసం ఉంటున్నారు. లకావత్..జీహెచ్ఎంసీలో రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. వీరి సంసారం ఉన్నంతలో హాయిగా సాగుతున్న క్రమంలో రెండేళ్ల క్రితం లకావత్ భార్య భారతికి..జనగాం జిల్లా అడవికేశాపురానికి చెందిన బానోతు ప్రవీణ్‌తో ఒక పెళ్లిలో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. ప్రవీణ్‌.. భారతి ఇంటి సమీపంలోనే నివాసముంటుండేవాడు. అయితే ఇటీవల భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో సొంతూరుకి వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకి వెళ్లాడు లకావత్. దీంతో ప్రియుడుకి ఫోన్ చేసి ఇంటికి పిలుపించుకుంది భారతి. అంతలోనే భర్త లకావత్ ఊరికి వెళ్లకుండా ఇంటికి తిరిగివచ్చాడు. తన భార్య భారతి- ప్రవీణ్‌ సన్నిహితంగా ఉండటాన్ని లకావత్ గమనించి మందలించాడు. తన బండారం బయటపడటంతో ఎపప్ుడైనా భర్త నుంచి తనకు ప్రమాదం ఉంటుందని భారతి భావించింది. భర్తను హత్య చేసి ప్రియుడితో హాయిగా ఉండాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం భర్త తనను మందలించిన రోజే మాస్టర్ ఫ్లాన్ తన ఫ్లాన్ ని ప్రియుడికి వివరించింది. అందుకు అతడు ఓకే చెప్పాడు.

Boyfriend On Rent : బెంగళూరులో అద్దెకు బాయ్ ఫ్రెండ్ సర్వీసులు ప్రారంభం..ఆ పనికి గంటల లెక్కన ఫీజు

దీంతో ప్రియుడుతో కలిసి అదే రోజు రాత్రి రాత్రి మద్యం మత్తులో ఉన్న భర్త గొంతుకు చున్నీ బిగించి ప్రాణం తీసింది. అనంతరం లకావత్ మృతదేహాన్ని అతని ద్విచక్రవాహనంపైనే ఇద్దరు కలిసి భువనగిరి వైపు తీసుకెళ్లారు. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై భువనగిరి మండలం అనంతారం గ్రామశివారులోని రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జిపైనుంచి ద్విచక్రవాహనాన్ని, మృతదేహాన్ని కిందకు పడేసి వెళ్లిపోయారు. 19వ తేదీ ఉదయం మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు మృతుని సెల్‌ఫోన్‌ ఆధారంగా లకావత్ తల్లికి సమాచారమిచ్చి కేసు దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్థలం దగ్గర మృతదేహం ఉన్న తీరు సందేహాస్పదంగా ఉండటంతోపాటు కొమురెళ్లి సోదరుడు వదినపై అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసులు భారతిని విచారించగా తాము చేసిన దారుణాన్ని వివరించి నేరాన్ని అంగీకరించింది. భారతి, ప్రవీణ్‌ను మంగళవారం అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Crime news, Telangana, Telangana crime news, Wife kills husband

ఉత్తమ కథలు