హోమ్ /వార్తలు /క్రైమ్ /

Wife Ignores Husband: పెళ్లి తరువాత యువతి జీవితంలో కీలక మలుపు.. భర్తకు ఊహించని షాక్..

Wife Ignores Husband: పెళ్లి తరువాత యువతి జీవితంలో కీలక మలుపు.. భర్తకు ఊహించని షాక్..

బాధితుడి పెళ్లి ఫోటో

బాధితుడి పెళ్లి ఫోటో

Wife and Husband: ఉద్యోగం వచ్చిన తర్వాత హర్‌ప్రీతి తన నుంచి డబ్బు డిమాండ్ చేసిందని మిథన్ తెలిపాడు. ఆ తర్వాత 14 నుంచి 15 లక్షల రూపాయలు ఖర్చు చేశానని పేర్కొన్నాడు.

డబ్బు, మంచి హోదా వచ్చిన తరువాత కొందరిలో మార్పు వస్తుంది. అప్పటివరకు తమతో ఉన్న వారిని వదిలేయడానికి కూడా కొందరు వెనకాడరు. తాజాగా అలాంటి ఘటన ఒకటి బీహార్‌లో వెలుగు చూసింది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న భర్తను భార్య వదిలి వెళ్లింది. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన వెంటనే భర్తను గుర్తించేందుకు భార్య నిరాకరించింది. ఇప్పుడు బాధిత భర్త న్యాయం కోసం ఎక్కడికక్కడ నిలదీస్తున్నాడు. జీవితాంతం కలిసి ఉంటామని ప్రమాణం చేసిన హర్‌ప్రీతి, మిథున్ చుట్టూ ఈ కేసు తిరుగుతుంది. తాను హర్‌ప్రీతితో ప్రేమలో పడ్డానని, ఆపై బాన్ పెళ్లి చేసుకున్నానని మిథున్ చెప్పాడు. అయితే ప్రస్తుతం తన భార్య తనను గుర్తించడానికి నిరాకరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు.

మిథున్ చెప్పిన దాని ప్రకారం.. అతని భార్య హర్‌ప్రీతికి బీహార్ పోలీస్‌ శాఖలో ఉద్యోగం వచ్చింది. దీని తర్వాత ఆమె అతని నుండి విడిపోయింది. ఇప్పుడు అతన్ని గుర్తించడానికి కూడా నిరాకరిస్తుంది. దీంతో కలత చెందిన మిథున్ సమస్తిపూర్ ఎస్పీని కలిసి తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న సమయంలో ఇద్దరం ఒకరికొకరు దగ్గరయ్యారని మిథున్ చెప్పాడు. తాను కూడా హర్‌ప్రీతికి ఉద్యోగం సంపాదించడంలో సహకరించాడు.

మాధేపురా జిల్లా కేదార్ ఘాట్ గ్రామానికి చెందిన హర్‌ప్రీతితో ప్రేమలో పడ్డానని మిథున్ చెప్పాడు. చాలా నెలల పాటు సహజీవనం చేసిన తర్వాత, కుటుంబ సభ్యుల అంగీకారంతో సహర్సాలోని మాతేశ్వర్ ధామ్ ఆలయంలో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన కొన్ని నెలల తర్వాత హర్‌ప్రీతికి బీహార్ పోలీస్‌లో ఉద్యోగం వచ్చింది. ఇంతలో భార్యను కలిసేందుకు సమస్తిపూర్‌కు చేరుకోగానే షాక్‌కు గురయ్యాడు. అతడిని భర్తగా అంగీకరించడానికి భార్య హర్‌ప్రీతి నిరాకరించింది. అనంతరం న్యాయం కోసం ఎస్‌ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు.

Gujarat Liquor : కల్తీ మద్యం తాగి 30 మంది బలి.. డ్రై స్టేట్ గుజరాత్‌లో ఘోరం.. రాజకీయ అండ?

Crime News: పెళ్లిరోజు నాడే సముద్ర తీరంలో వివాహిత అదృశ్యం.. భర్త పక్కనుండగానే.. పెరుగుతున్న అనుమానాలు?

ఉద్యోగం వచ్చిన తర్వాత హర్‌ప్రీతి తన నుంచి డబ్బు డిమాండ్ చేసిందని మిథన్ తెలిపాడు. ఆ తర్వాత 14 నుంచి 15 లక్షల రూపాయలు ఖర్చు చేశానని పేర్కొన్నాడు. అయితే ఉద్యోగం రాగానే ఆమె తనను వదిలేసిందని ఆరోపించాడు. ప్రస్తుతం మిథున్ భార్య హర్‌ప్రీతి సమస్తిపూర్ జిల్లా పటౌరీ స్టేషన్‌లో పనిచేస్తున్నారు. న్యాయం చేయాలంటూ సమస్తిపూర్ ఎస్పీ కార్యాలయంలో మితాప్ దరఖాస్తు చేసుకున్నారు.

First published:

Tags: Wife and husband

ఉత్తమ కథలు