WIFE WAS NOT TALKING ANGRY HUSBAND TAKEN THIS DECISION INCIDENT HAPPEND IN MUMBAI SSR
Shocking: ఈమె ఆటోలో వెళుతోంది.. వీళ్లాయన బైక్‌పై వెళ్లి ఆటో ఆపాడు.. ఆ తర్వాత ఇలా జరుగుతుందని ఎవరూ అనుకోరు..
ఆకాంక్ష (ఫైల్ ఫొటో)
ఆటోలో ఆకాంక్ష బయటకు వెళుతున్న విషయం తెలుసుకున్న అక్షయ్ ఆమె వెళుతున్న ఆటోను బైక్‌పై వెంబడించాడు. ఆటో చెంబూర్ వద్దకు చేరుకోగానే బైక్‌పై వేగంగా వెళ్లి ఆటోను అడ్డగించాడు. ఆకాంక్షను ఆటో నుంచి దిగాలని, తనతో మాట్లాడమని అక్షయ్ అడిగాడు.
ముంబై: భార్యాభర్తల మధ్య ఏదో ఒక సందర్భంలో చిన్నచిన్న గొడవలు రావడం సహజం. ఇద్దరూ కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకుంటే ఆ గొడవ సమసిపోతుంది. అలా కాకుండా ఆవేశానికి లోనైతే ఆ గొడవ పెరిగి పెద్దదవుతుంది. ఆ క్షణికావేశంలో కొందరు హత్యలు చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో ఉన్న అశోక్ నగర్‌లో సరిగ్గా ఇదే ఘటన జరిగింది. నడిరోడ్డుపై పట్టపగలు ఆటోలో వెళుతున్న భార్యను బైక్‌పై వెంబడించి మరీ భర్త దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆకాంక్ష, అక్షయ్ 2019లో పెళ్లి చేసుకున్నారు. గత వారమే ఆకాంక్ష 21వ పుట్టినరోజు చేసుకుంది. పెళ్లయిన సంవత్సరం వరకూ భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగానే ఉన్నారు. ఆ తర్వాత నుంచి ఇద్దరి మధ్య చిన్నచిన్న మనస్పర్థలు, అభిప్రాయ భేదాలు తలెత్తాయి.
కొన్నాళ్లకు ఇద్దరూ ప్రతిరోజూ గొడవ పడటం మొదలుపెట్టారు. అక్షయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆకాంక్ష పెద్దలను కూడా కాదనుకుని అతనిలో ఉంది. కానీ.. అక్షయ్ భార్యపై చిరాకు, అసహనం వ్యక్తం చేస్తూ ఆమెను ఇబ్బందిపెట్టసాగాడు. ప్రేమగా చూసుకోవడమే మానేశాడు. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన ఆకాంక్ష కొన్నేళ్ల క్రితం ఇక అతనితో ఉండలేనంటూ పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి పుట్టింట్లోనే ఉంటోంది. అక్షయ్ భార్య కోసం ఆమె పుట్టింటికి తరచుగా వెళుతుండేవాడు. ఆమెను తిరిగి రావాలని కోరాడు. అప్పటికే అక్షయ్ మనస్తత్వంతో విసిగిపోయిన ఆకాంక్ష వెళ్లేందుకు ఇష్టపడలేదు. అయినా ఆమెను తనతో మాట్లాడాలంటూ అక్షయ్ వెంటపడుతుండేవాడు. ఆకాంక్ష ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్లేవాడు. కానీ.. ఆకాంక్ష అతనితో మాట్లాడేందుకు ఇష్టపడలేదు. దీంతో.. ఆకాంక్షపై అక్షయ్ కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే గత గురువారం ఆటోలో ఆకాంక్ష బయటకు వెళుతున్న విషయం తెలుసుకున్న అక్షయ్ ఆమె వెళుతున్న ఆటోను బైక్‌పై వెంబడించాడు. ఆటో చెంబూర్ వద్దకు చేరుకోగానే బైక్‌పై వేగంగా వెళ్లి ఆటోను అడ్డగించాడు.
ఆకాంక్షను ఆటో నుంచి దిగాలని, తనతో మాట్లాడమని అక్షయ్ అడిగాడు. మాట్లాడేదేం లేదని, ఆటోను పోనివ్వాలని డ్రైవర్‌కు ఆమె చెప్పింది. ఈ పరిణామంతో క్షణికావేశానికి లోనైన అక్షయ్ ఆటోలోనే కూర్చుని ఉన్న ఆకాంక్షను కత్తితో పొడిచి దాడి చేశాడు. ఆ తర్వాత అక్కడ నుంచి బైక్‌పై పరారయ్యాడు. ఈ ఘటనతో రోడ్డుపై వెళుతన్న వాళ్లంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు ఎటు వెళ్లింది గుర్తించి అతనిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ బాలాసాహెబ్ మాట్లాడుతూ.. ఆకాంక్ష ఇంటి నుంచి ఆటోలో ఆఫీస్‌కు వెళుతుండగా ఆమె భర్త ఆటోను అడ్డగించి ఆమెను పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడని తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.