భర్తకు విషం ఇచ్చిన భార్య... పెళ్లైన వారానికే...

Ananthapuram : భర్తను చంపేయాలని భార్య ఎందుకు అనుకుంది? చంపేందుకు ఆమె ఎలాంటి ప్లాన్ వేసింది? ఈ కేసుపై పోలీసులు ఏం చెబుతున్నారు?

news18-telugu
Updated: November 18, 2019, 12:00 PM IST
భర్తకు విషం ఇచ్చిన భార్య... పెళ్లైన వారానికే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Andhra Pradesh : పతియే ప్రత్యక్ష దైవం... చిలకా గోరింకలు... ఇవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. రియల్ లైఫ్‌లో మాత్రం... చాలా మంది భార్యాభర్తలు లేనిపోని అరాచకాలకు పాల్పడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో భర్తే... భార్యను చంపుతుంటే... మరికొన్ని సందర్భాల్లో... భార్యే... భర్తను చంపేస్తోంది. ఇందుకు ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. వివాహేతర సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు... కారణాలు ఏవైతేనేం... కాపురాలు కూలిపోవడమే కాదు... నేరాలు, ఘోరాలూ కూడా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్... అనంతపురం జిల్లాలో అలాంటి ఘటనే కలకలం రేపింది. భార్యే విషం ఇచ్చిందని తెలియడంతో... అనంతపురం పోలీసులు... ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు లింగమయ్యను కలిశారు. ఏం జరిగిందని అడిగారు. లింగమయ్య చెప్పింది విని ఆశ్చర్యపోయారు.

బాధితుడు లింగమయ్యది కర్నూలు జిల్లాలోని... తుగ్గలి మండలంలో ఉన్న జొన్నగిరి ఊరు. ఆమెది కర్నూలు జిల్లాలోని మదనంతపురం గ్రామం. వీళ్లిద్దరికీ... వారం కిందటే పెళ్లైంది. రెండువైపుల పెద్దలూ వచ్చి... పెళ్లి భోజనం చేసి... వధూవరుల్ని పిల్లాపాపలతో నిండు నూరేళ్లూ హాయిగా జీవించమని దీవించారు. పెళ్లి తర్వాత సంప్రదాయాల్లో భాగంగా... లింగమయ్య అత్తారింటికి వచ్చాడు. ఇంట్లో పెద్దవాళ్లంతా... ఏవేవో పనుల్లో బిజీ అయ్యారు. అలాంటి సమయంలో... భర్త ముందుకు పాల గ్లాసుతో వచ్చింది ఆమె. నవ్వుతూ ఇచ్చిన పాల గ్లాస్ తీసుకొని... ఆమెనే చూస్తూ... ఆనందంగా తాగేశాడు.

(పావు గంట తర్వాత)

లింగమయ్యకు కడుపులో నొప్పి వచ్చింది. అది రెగ్యులర్ నొప్పి కాదు. సూదులతో పొడుస్తున్నట్లు... గుద్దుతున్నట్లు రకరకాలుగా అనిపించింది. తట్టుకోలేకపోయాడు. గిలగిలా కొట్టుకుంటూ కిందపడ్డాడు. ఆమెతోపాటూ... అత్తమామలు, బంధువులూ అంతా పరిగెత్తుకొచ్చారు. ఏమైంది... అయ్యో అల్లుడుగారు ఎందుకలా అయిపోతున్నారు... అంటూ... ఆయన్ని హడావుడిగా గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే లింగమయ్య అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గుత్తి డాక్టర్లు... వెంటనే అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్లండి. లేదంటే ప్రమాదం అన్నారు. సరే అని హడావుడిగా లింగమయ్యను అనంతపురం ఆస్పత్రికి తరలించారు.

విషం ఎందుకిచ్చింది? : ఈ విషయం ఇంకా తేలలేదు. లింగమయ్యను ఇంటరాగేట్ చేసిన పోలీసులు... నెక్ట్స్ అతని అత్తారింటికి వెళ్తామని తెలిపారు. అక్కడ అసలు విషయం రివీల్ అవుతుందని భావిస్తున్నారు. జనరల్‌గా పెళ్లి ఇష్టంలేకపోయినా, ఆల్రెడీ ఎవర్నైనా ప్రేమిస్తూ ఉన్నా... అలాంటి వాళ్లు ఇలాంటి విషపూరిత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. పోలీసులు కూడా ఇలాంటి అన్ని యాంగిల్సూ లెక్కలోకి తీసుకుంటామంటున్నారు.

 

అష్నా జవేరీ అదిరే ఫొటోస్...


ఇవి కూడా చదవండి :

షానా చౌహాన్... సక్సెస్‌కి చిరునామా...

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాబ్డే ప్రమాణస్వీకారం...

ఒంటరి యువతిపై రేప్... చికెన్ బిర్యానీ ఇచ్చి...

అయోధ్య తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్? నెక్ట్స్ ఏమవుతుంది?

స్కూళ్లకు సెలవులు ఇవ్వండి... ప్రభుత్వానికి పేరెంట్స్ విజ్ఞప్తి

 
First published: November 18, 2019, 11:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading