WIFE TRYED TO KILL HUSBAND ALONG WITH HER LOVERS AT HOME VRY
crime news : ఇదేంటని ప్రశ్నించిన భర్తను బిల్డింగ్ నుండి తోసేసింది. ఇంతకి భార్య ఏం చేసింది..?
ప్రతీకాత్మక చిత్రం
crime news : ఇంటికి చేరుకున్న భర్తకు తన ఇద్దరు ప్రియుల నడుమ ఉన్న భార్య అసభ్యకరంగా కనిపించింది. దీంతో షాక్‌లోకి వెళ్లిన భర్త ఆమెను ఇదేంటని నిలదీశాడు. దీంతో ఇద్దరు ప్రియులతో కలిసి భర్తను హతమార్చే ప్రయత్నం చేసింది.
భార్యభర్తల మధ్య అక్రమ సంబంధాలు మనుషుల ప్రాణాలనే ప్రాణాలనే బలిగొంటుంది. భర్త,భార్య అనే సంబంధాలను చెరిపివేస్తోంది. అక్రమసంబంధాలతో విచక్షణ కొల్పోతున్నవారు హత్యలకు పాల్పడుతున్నారు. భార్యపై భర్త, భర్తపై భార్య కుట్రలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని కనాడియాలో హిమాన్ష్ చౌహాన్ తాను ఇంట్లో లేని సమయంలో ఇద్దరు వ్యక్తులతో కలిసి కనిపించింది. దీంతో ఈ విషయంపై తన భార్యను ప్రశ్నించాడు. రెడ్ హ్యండెడ్‌గా భర్తకు దొరకడంతో..తన ఇద్దరు ప్రియులతో కలిసి అదే బిల్డింగ్‌లోని నాలుగవ అంతస్థులోకి తీసుకువెళ్లింది. అక్కడ నలుగురి మధ్య వాగ్వవాదం జరిగింది..ఈ నేపథ్యంలోనే హిమాన్ష్ చౌహాన్ బిల్డింగ్మిద నుండి పడిపోయాడు.
అయితే దురదృష్టవశాత్తు నాలుగు అంతస్థుల నుండి కింద పడినా ప్రాణాలు కొల్పోలేదు..దీంతో హుటాహుటిన స్థానికలు ఆసుపత్రిలో చికిత్స కోసం పంపించారు. కాగా హిమాన్షు పరిస్థితి నిలకడగా ఉంది. అయితే ట్విస్ట్ ఏమిటంటే తనను ఎవరు నెట్టివేయలేదనే స్టేట్మెంట్ను గాయపడ్డ హిమాన్షు ఇవ్వడం కొసమెరుపు .తనకు తానుగా బిల్డింగ్మీద నుండి పడిపోయానని చెబుతున్నారు..
అయితే హిమాన్షు బంధువులు మాత్రం మరో అర్గ్యూమెంట్ చేస్తున్నారు.హిమాన్షును ప్రియుడితో కలిసి భార్య హత్య చేసేందుకు ప్రయత్నాలు చేసిందని, అసలు విషయం చెబితే..మరోసారి హత్యకు చేస్తానని బెదిరించిందని చెబతున్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.