భర్తను చంపేందుకు భార్య స్కెచ్... ఆ తర్వాత...

Damarcherla : పతియే ప్రత్యక్ష దైవం, భర్తే ప్రాణం... ఇలాంటి డైలాగ్స్‌కి ఆమె గుడ్ బై చెప్పింది. భర్త హత్యకు ఓ ముఠాతో డీల్ కుదుర్చుకుంది. మరి ఎక్కడ తేడా వచ్చింది?

news18-telugu
Updated: December 10, 2019, 6:24 AM IST
భర్తను చంపేందుకు భార్య స్కెచ్... ఆ తర్వాత...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Telangana : నల్గొండ జిల్లా... అడవిదేవులపల్లి మండలంలోని ఓ గ్రామంలో జరిగిందీ తంతు. బాధితుడికి పదిహేనేళ్ల కిందట తన అక్క కూతురితో పెళ్లైంది. వాళ్లకు ఇద్దరు కూతుర్లున్నారు. పెళ్లైన 15 ఏళ్ల తర్వాత ఆమెకు భర్తపై ఆసక్తి పోయింది. అతన్ని వదిలించుకోవాలనుకుంది. అందుకు విడాకులకు అప్లై చేసి ఉంటే బాగుండేది. అలా చెయ్యడం మానేసి ఏకంగా అతన్ని లేపేయాలని డిసైడైంది. దీనికి కారణం వివాహేతర సంబంధం. ఆ ఫ్యామిలీ ఉంటున్న ఊళ్లోనే అరటిపండ్ల వ్యాపారం చేస్తున్న... గుంటూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. తరచూ అతని దగ్గరకు వెళ్తున్న ఆమె... తమ మధ్య భర్త అడ్డుగా ఉన్నాడని అనుకుంది. "నా భర్తను వదిలేసి వచ్చేస్తాను... నీతోనే ఉండిపోతాను" అంది. "నీ భర్త ఉండగా నా దగ్గరకు వస్తే ఊరుకుంటాడా చంపేస్తాడు" అన్నాడు. "ఐతే ఏం చేద్దాం... పోనీ తననే చంపేస్తే" అంది. బాగా ఆలోచించిన అతడు... "సరే నీ భర్తనే లేపేద్దాం" అన్నాడు. అతని సాయంతో... గుంటూరు జిల్లా నుంచీ 9 మంది సుపారీ హంతకుల్ని తెలంగాణకు రప్పించింది. నా భర్తను చంపేయండి అంటూ వాళ్లకు రూ.8 లక్షల సుపారీ ఇచ్చింది. డబ్బు తీసుకున్నాక వాళ్లో పనికిమాలిన ప్లాన్ చెప్పారు. ఆ ప్రకారం... భర్తకు అన్నంలో విషం కలిపి పెట్టింది. ఆ అన్నం తిని చక్కగా పనికి వెళ్లిపోయాడు. ఆశ్చర్యపోయింది. మళ్లీ సుపారీ హంతకుల్ని కలిసింది. విషయం చెప్పింది. వాళ్లూ షాకయ్యారు. సరే ఈసారి ఇలా చెయ్యండి అని మరో ప్లాన్ చెప్పారు. సరేనన్న ఆమె... ఇంటికి వెళ్లి... ఆ గ్యాంగ్ ఇచ్చిన విషపు ఇంజెక్షన్ బయటకు తీసి... దాంతో భర్తను పొడవబోయింది. చివరిక్షణంలో భర్తకు డౌట్ వచ్చింది. తప్పించుకున్నాడు. ఇదేదో ప్లాన్ వేసింది అనుకున్న అతను... ఏంటి విషయం అని నిలదీశాడు. ఏమీ చెప్పకుండా సైలెంటైంది. మర్నాడు ఇంట్లోంచీ పారిపోయింది. భార్య కనిపించట్లేదని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు ఆమె మొబైల్ నంబర్‌ను ట్రాక్ చెయ్యగా... గుంటూరులో ఉన్నట్లు తెలిసింది. ఎలాంటి ట్విస్టులూ లేకుండా డైరెక్టుగా వెళ్లి ఆమెను అరెస్టు చేశారు. గట్టిగా ప్రశ్నించగా... మొత్తం మేటర్ బయటికొచ్చింది. ఆమెతోపాటూ... ఆ అరటి పండ్ల ప్రియుణ్ని, 9 మంది సుపారీ హంతకుల్నీ అరెస్టు చేశారు.


టాలీవుడ్ హీరోపై మనసు పారేసుకున్న కన్నడ నటి
ఇవి కూడా చదవండి :

పౌరసత్వ బిల్లుకు లోక్‌సభ ఆమోదం...

మిస్ యూనివర్స్‌ 2019... సౌతాఫ్రికా బ్యూటీ జొజిబినీ టున్జీ

పాము కాటేసినప్పుడు టీ తాగితే ఏమవుతుంది?Health Tips : పట్టులాంటి జుట్టు కావాలా... ఉల్లిపాయలతో ఇలా చెయ్యండి

Health Tips : ఎంతకీ చుండ్రు తగ్గట్లేదా? ఇలా చెయ్యండి చాలు

Published by: Krishna Kumar N
First published: December 10, 2019, 6:24 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading