ప్రియుడితో ఆ పని చేసేందుకు అడ్డుగా ఉన్నాడని భర్తకు బిర్యానీలో విషం కలిపి...

ఇదే అదునుగా భావించిన నిందితురాలు స్కూలు టీచర్ తో ప్రేమాయణం కొనసాగించింది. అది కాస్తా ముదిరి అతడితో వివాహేతర బంధానికి దారి తీసింది. ఇద్దరూ శారీరకంగా కలవడం మొదలుపెట్టారు.

news18-telugu
Updated: July 21, 2019, 7:39 PM IST
ప్రియుడితో ఆ పని చేసేందుకు అడ్డుగా ఉన్నాడని భర్తకు బిర్యానీలో విషం కలిపి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తమ వివాహేతర బంధానికి అడ్డంగా ఉన్నాడని కట్టుకున్న భర్తకు బిర్యానీలో విషయం కలిపి పెట్టిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే వేలూరు జిల్లాకు చెందిన జోలార్ పేట గ్రామంలో గణేష్(పేరు మార్చబడింది), అతడి భార్య జయ( పేరు మార్చబడింది), వారి కుమార్తెతో కలిసి జీవనం కొనసాగిస్తున్నారు. అయితే బాధితుడి భార్య అదే గ్రామానికి చెందిన ఒక స్కూల్ టీచర్‌తో చనువుగా ఉండటం ప్రారంభించింది. భర్త గణేష్ ఉద్యోగ రీత్యా హోసూరులో నివాసముంటున్నాడు. ఇదే అదునుగా భావించిన నిందితురాలు స్కూలు టీచర్ తో ప్రేమాయణం కొనసాగించింది. అది కాస్తా ముదిరి అతడితో వివాహేతర బంధానికి దారి తీసింది. ఇద్దరూ శారీరకంగా కలవడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని గమనించిన బాధితుడి సన్నిహితులు ఆమె నడవడిక పై అతడికి ఫిర్యాదు చేశారు. దీంతో గణేష్ తన భార్యపై ఒక కన్నేసి ఉంచాడు. ఒకరోజు స్కూల్ టీచర్‌తో కలిసి ఆమె కలిసి ఉన్న సమయంలో గణేష్ చూసి నిలదీశాడు. అప్పటి నుంచి ఆమె స్కూల్ టీచర్ ను దూరం పెడుతూ వచ్చింది. అయితే కొంత కాలం గడిచిన తర్వాత జయ సదరు స్కూల్ టీచర్ ను విడిచి ఉండలేకపోయింది.

ఎలాగైన భర్తను కడతేర్చి ప్రియుడు స్కూల్ టీచర్‌తో జతకట్టాలని పథకం పన్నింది. ఒక రోజు జయ బిర్యానీ వండి, అందులో విషం కలిపింది. భర్తతో తాను మారిపోయానని నమ్మించి కుటిల పన్నాగం పన్ని, అతనికి బిర్యానీ వడ్డించింది. బిర్యానీ తిన్న బాధితుడు గణేష్ వాంతులు చేసుకోవడం ప్రారంభించాడు. ఇదే అదనుగా భావించిన జయ ఇంటికి తాళం వేసి పరారైంది. అయితే అదే సమయంలో గణేష్ కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి కిటికీ లోంచి చూడగా, గణేష్ అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఆ తర్వాత బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయగా, నిందితురాలు జయ పరారీలో ఉన్నారు.

First published: July 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...